కేసీఆర్ చేస్తే అలా.. మీరు చేస్తే ఏమనాలి?: కాంగ్రెస్‌పై కేటీఆర్ సూటిప్రశ్న
సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి విమర్వలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాలకు దూరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన న్యాయమైన సమస్యల కోసం గతంలో సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ ప్రధానితో సమావేశాలను బహిష్కరిస్తే.. కాంగ్రెస్ తప్పుబట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో భేటీకి వెళ్లకున్నా బీఆర్ఎస్, బీజేపీతో కలిశామని ఆరోపించారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉండటానికి ఆ రెండు పార్టీలు కుమ్మక్కు కావటమే కారణమంటూ విమర్శించారని కేటీఆర్ పేర్కొన్నారు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తే.. కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. చోటా భాయ్ రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రిని కలవాలని, రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ సమస్యల గురించి మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదని కేటీఆర్ నిలదీశారు.
When CM KCR was boycotting meetings with PM for rightful issues concerning Telangana’s pride, Congress had issues & accused us of collusion etc
— KTR (@KTRBRS) July 26, 2024
Now what will Congress say when Revanth Reddy is himself boycotting Niti Ayog meeting?
Why does younger brother not want to meet PM…
మరోవైపు, శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి మేడిగడ్డ సందర్శించిన కేటీఆర్.. కాంగ్రెస్ సర్కారుకు హెచ్చరికలు చేశారు. శాసన సభ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్‌హౌస్‌లు ఆన్ చేసి బీడు భూములకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుకు హితవు పలికారు. కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్‌ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు కాళేశ్వరం పంప్‌హౌస్‌లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్‌తో పాటు మేడిగడ్డను కేటీఆర్ పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు.












Click it and Unblock the Notifications