కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మోడీ వైస్రాయ్ అవుతారా? లేక గవర్నర్లను ఎత్తేస్తారా?: కేటీఆర్ విమర్శల దాడి

గవర్నర వ్యవస్థపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడటం, రాజ్‌భవన్‌లో పార్టీకి చెందిన నాయకుల ఫొటోలను

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గవర్నర వ్యవస్థపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడటం, రాజ్‌భవన్‌లో పార్టీకి చెందిన నాయకుల ఫొటోలను పెట్టడం సరికాదన్నారు.
సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజ్‌భవన్‌లో రాజకీయ కార్యకలాపాలా అంటూ కేటీఆర్

రాజ్‌భవన్‌లో రాజకీయ కార్యకలాపాలా అంటూ కేటీఆర్

రాజ్‌‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చొద్దని, అది దేశానికి మంచిది కాదన్నారు కేటీఆర్. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై తనకేం తెలియదన్నారు. తాను కూడా ఇక్కడేవున్నానని చెప్పారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి, సీఎం ఆ అంశాన్ని చూసుకుంటారన్నారు. రాజ్ భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం దేశానికి, వ్యవస్థకు మంచిది కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మోడీ అప్పుడలా.. ఇప్పుడిలా అంటూ కేటీఆర్ ఫైర్

మోడీ అప్పుడలా.. ఇప్పుడిలా అంటూ కేటీఆర్ ఫైర్

ప్రధాని మోడీ బ్రిటీష్ కాలం నాటి బానిస చిహ్నాలు పోవాలని అన్నారని.. అందుకే రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్ అని మార్చామని చెప్పారని కేటీఆర్ అన్నారు. అయితే, గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటీషోళ్లు పెట్టిందే.. మరి అవి ఎందుకు ఉండాలో.. దాని వల్ల దేశానికి ఏం ఉపయోగమో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని, ముఖ్యమంత్రినేమో ప్రజలు ఎన్నుకున్నారు.. గవర్నర్లను ఎవరు ఎన్నుకున్నారని కేటీఆర్ నిలదీశారు.

సీఎంగా ఉన్నప్పుడు మోడీనే.. రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ పదవి ఇవ్వొద్దని చెప్పారని తెలిపారు. రెండేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉంటేనే ఇవ్వాలని మోడీ చెప్పారన్నారు. మరి ఇవాళ మోడీ అది పాటిస్తున్నారా? అని ప్రశ్నించారు కేటీఆర్. అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడు మాటలను తుంగలో తొక్కారని ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.

వైస్రాయ్ అవుతారా? లేక గవర్నర్లను ఎత్తేస్తారా?: మోడీకి కేటీఆర్ ప్రశ్న

వైస్రాయ్ అవుతారా? లేక గవర్నర్లను ఎత్తేస్తారా?: మోడీకి కేటీఆర్ ప్రశ్న

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయన్నారు కేటీఆర్. బ్రిటీష్ కాలంలోలా ప్రధానమంత్రి తన పేరును వైశ్రాయ్ అని మార్చుకోవాలని.. లేదంటే ఇక్కడ గవర్నర్లను అయినా ఎత్తేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలన్నారు కేటీఆర్. కాగా, గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల రిపబ్లిక్ డే వేడుకలు, ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు చర్చనీయాంశంగా మారాయి.

English summary
KTR fires at pm modi for governor system issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X