ఎన్టీఆర్, కేసీఆర్ ఇద్దరు మాత్రమే మహనీయులు; మోడీ, కేంద్రంలోని బీజేపీకి కేటీఆర్ చురకలు
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీ కొనసాగుతుంది. ఈ సమావేశాలలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు. ఇక ప్లీనరీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ జాతీయ రాజకీయాల పైన, తెలంగాణ సాధించిన ప్రగతిపైన కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు వారి చరిత్రలో ఇద్దరు మహనీయులు.. వీరే అన్న కేటీఆర్
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పాత్ర పై తీర్మానం చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలుగు వారి చరిత్ర తిరిగి చూస్తే ఇద్దరు మహనీయులు కనిపిస్తున్నారని ఒకరు ఎన్టీఆర్ అయితే మరొకరు కెసిఆర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాలకు సీఎంలు ఉంటారని, కానీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ చావు నోట్లో తల పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్న కేటీఆర్ అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే భారతదేశానికే తెలంగాణ దిక్సూచిగా మార్చారని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.

మన పథకాలనే కేంద్రం కాపీ కొడుతుంది
అవినీతి రహితంగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎండిపోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కెసిఆర్ జీవకళ తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. ఇక మన పథకాలనే కేంద్రం కాపీ కొడుతుందని పేర్కొన్న కేటీఆర్ రైతు బంధు పథకం కేంద్రానికి ప్రేరణ అయిందని వెల్లడించారు. టీఎస్ ఐపాస్ లా కేంద్రం సింగిల్ విండో తీసుకు వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో 24 గంటలు కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అని కేటీఆర్ తెలిపారు.

వైఫల్యాల చరిత్ర బీజేపీది
దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం కూడా మన తెలంగాణానే అంటూ కేటీఆర్ వెల్లడించారు. కుల, మత పిచ్చి లేకుండా సంక్షేమ దిశలో ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇక వైఫల్యాల చరిత్ర బీజేపీదని పేర్కొన్న కేటీఆర్ తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అంటూ బిజెపి నేతలపై నిప్పులు చెరిగారు. దేశానికి టెలివిజన్ నాయకుడు కాదు విజన్ ఉన్న నాయకుడు కావాలని మోడీని టార్గెట్ చేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ లాంటి టార్చ్ బేరర్ ఈ దేశానికి కావాలని పేర్కొన్న మంత్రి కేటీఆర్ ఉద్వేగాల భారతం కాదు ఉద్యోగాల భారతం కావాలంటూ వ్యాఖ్యలు చేశారు.

బుల్డోజర్ మోడల్, బిల్డప్ మోడల్ కాదు, గోల్డెన్ తెలంగాణ మోడల్ దేశానికి కావాలి
డబల్ ఇంజన్ సర్కార్ కాదు గ్రోత్ ఇంజన్ సర్కార్ కావాలి. బుల్డోజర్ మోడల్, బిల్డప్ మోడల్ కాదు, గోల్డెన్ తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం కావాలని కేటీఆర్ పేర్కొన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్న మోడీ పాలనలో వికాస్ అనే పదం వింత పదం అయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. భారతదేశాన్ని కాపాడాలంటే కెసీఆర్ వంటి గొప్ప నాయకుడు కావాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications