ఢిల్లీ కేంద్రంగా ఆట మొదలెట్టిన కేసీఆర్.. షాక్ లో రేవంత్!
తెలంగాణ రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయని ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణాను పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపైన, ప్రధాని మోడీ పైన నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ తాజా పరిణామాల నేపథ్యంలో బిజెపితో దోస్తానకు సిద్ధమైందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ ఊహగానాలకు బలాన్ని చేకూరుస్తూ గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావులు మకాం వేయటం ఆసక్తిగా మారింది.
కవిత డిఫాల్ట్ బెయిల్ ఉపసంహరణ అందుకేనా
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో ఇరుక్కుని బయటకు రాలేక సతమతమవుతున్న కవితను బయటకు తీసుకురావడానికి న్యాయస్థానాల వేదికగా చాలా కాలంగా ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. చివరకు సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ, తాజాగా కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవడం కూడా రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

కవిత బెయిల్ కోసం కొత్త ప్లాన్
డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కూడా కవితకు అనుకూలంగా వచ్చే అవకాశం లేని కారణంగా కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నట్టు సమాచారం. బిజెపితో బిఆర్ఎస్ దోస్తానా ఫిక్స్ అయితే కవిత బయటకు వచ్చే అవకాశం ఉందని, ఈ క్రమంలోనే జరుగుతున్న తాజా పరిణామాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం వార్తలు
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం కోసం బిఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలాఉంటే బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, నేతలు వెళుతున్న క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో ఫైట్ చేసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నట్టు తెలుస్తుంది.
ఎన్డీయే సర్కార్ కు రాజ్యసభలో అవసరం
మరోవైపు బిజెపితో కలిసి ప్రయాణం చేయాలని కెసిఆర్ భావిస్తున్నట్టు, ఈ మేరకే బీఆర్ఎస్ తరఫున దూతలుగా కేటీఆర్, హరీష్ రావు లను ఢిల్లీ పంపినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. బిజెపికి రాజ్యసభలో ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే మ్యాజిక్ ఫిగర్ 121 సభ్యులు ఉండాల్సిన నేపథ్యంలో, ఎన్డీఏ కూటమికి 114 మాత్రమే ఉన్నారు.
బీఆర్ఎస్ తో దోస్తానాకు బీజేపీ కూడా సిద్ధం
బిఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేస్తే బిఆర్ఎస్ పార్టీలోని రాజ్యసభ సభ్యులు నలుగురితో కలిపి ఎన్డీఏ కూటమి బలం 118 అవుతుంది. ఇక ఇండికూటమిలో లేని తటస్తులు కూటమికి మద్దతిస్తే మొత్తం 121 మంది సభ్యులతో రాజ్యసభలో ఎన్డీఏ కూటమి బిల్లును ఆమోదం పొందుతాయి. ఈ క్రమంలో బిఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి బిజెపి కూడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది.
డీల్ కుడుర్చుకుంటారా? బిజెపిలో విలీనం చేస్తారా?
అయితే కేటీఆర్ హరీష్ రావు ప్రస్తుతం ఢిల్లీలో ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో అవసరం ఉన్న నేపథ్యంలో డీల్ కుదుర్చుకుంటారా లేక పార్టీని బిజెపిలో విలీనం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా తెలంగాణ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పై పోరుకు బిఆర్ఎస్ కు బలం దొరుకుతుంది కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని, ఢిల్లీ మద్యం కుంభకోణం లో కవితకు ఉపశమనం దొరుకుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది అన్నది మాత్రం వాస్తవం. ఢిల్లీ కేంద్రంగా ఆట మొదలెట్టిన కేసీఆర్ ప్లాన్ తో రేవంత్ రెడ్డి కి షాక్ తగిలేలా ఉంది.












Click it and Unblock the Notifications