మోడీ మళ్లీ ప్రధాని ఐతే ఇక జరిగేదిదే: విపక్ష భేటీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. డిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రక్షణ శాఖ భూములున్న చోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందన్నారు. కంటోన్మెంట్ లీజ్ భూములను జీహెచ్ఎంసీకి బదలాయించాలని కోరినట్లు తెలిపారు.

తొమ్మిదేళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని.. ఇప్పటికీ ఒప్పుకోలేదన్నారు మంత్రి కేటీఆర్. కొత్తగా 31 కిలో మీటర్ల మెట్రో రైలు విస్తరణకు కూడా కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందదని తెలిసినా.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీకి వచ్చి మంత్రులను కలుస్తున్నామన్నారు. స్కైవేలు, స్కై వాక్స్ కోసం ర‌క్ష‌ణ శాఖ భూములు కేటాయిస్తే.. ల్యాండ్ ఫ‌ర్ ల్యాండ్ కూడా ఇస్తామ‌ని.. తొమ్మిదేండ్ల కాలంలో ఐదుగురు ర‌క్ష‌ణ శాఖ మంత్రుల‌ను 15 నుంచి 20 సార్లు క‌లిశామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

htr

స్వ‌యంగా ప్ర‌ధానిని మా ముఖ్య‌మంత్రి క‌లిశారు. హైద‌రాబాద్ న‌గ‌రం భార‌త‌దేశంలోనే శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న న‌గ‌రం. ఐటీ రంగం ఎదుగుతుంది. ఐటీ ఉద్యోగాల్లో 44 శాతం ఉద్యోగాలు ఒక్క హైద‌రాబాద్ నుంచే వ‌స్తున్నాయి. మ‌రో వైపు వ్యాక్సిన్ ప్రొడ‌క్ష‌న్‌కు హైద‌రాబాద్ గ్లోబ‌ల్ హ‌బ్‌గా మారింది. ఫార్మా, బ‌యోటెక్ రంగంలో అదే విధంగా ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో కూడా అత్యంత కీల‌క‌మైన న‌గ‌రంగా ఎదిగింది. ఏ ర‌కంగా చూసినా ఈ న‌గ‌రం జాతి నిర్మాణానికి ఉప‌యోగ‌ప‌డే న‌గ‌రం కాబ‌ట్టి.. మాకు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో స‌హాయం అందించండి. స్కైవేల నిర్మాణం కోసం ర‌క్ష‌ణ శాఖ భూములు కేటాయించాల‌ని తొమ్మిదేండ్ల నుంచి కోరుతున్నామని కేటీఆర్ తెలిపారు. మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణ ప్రాజెక్టులకు సహకరించాలని కోరామన్నారు. సహకరించకుంటే కేంద్రం వైఖరిని ప్రజల్లో ఎండగడతామన్నారు మంత్రి కేటీఆర్.

రాష్ట్రానికి అప్పుగా ఇచ్చిన వాటిని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. దేశ సమస్యలను కాంగ్రెస్, బీజేపీ పరిష్కరించలేకపోయాయని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీకి మరో ఛాన్సిస్తే రాజధాని కూడా గుజరాత్‌కే తీసుకెళ్తారన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలకే ఎక్కువగా నిధులిస్తున్నారని ఆరోపించారు.

ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరుగుతున్న విపక్షాల భేటీపైనా కేటీఆర్ స్పందించారు. ఆ భేటీకి బీఆర్ఎస్ దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటే అన్నారు. పార్టీలు కాదు.. ప్రజలు ఏకం కావాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీల కారణంగానే ఇప్పటికే తాగునీరు, విద్యుత్ సమస్య ఉందన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఎవరికీ బీటీం కాదని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మేఘాలయాలో బీజేపీ, కాంగ్రెస్, ఎన్పీపీ పొత్తు పెట్టుకున్నాయన్నారు. ఇక కరీంనగర్, నిజామాబాద్ జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కైయ్యాయని కేటీఆర్ ఆరోపించారు. దేశంలో అత్యంత బలహీనమైన ప్రధాని మోడీనేనని కేటీఆర్ విమర్శించారు. ద్రవ్యోల్బణం, సిలిండర్ ధరలు, అప్పులు పెరిగాయన్నారు.

ఢిల్లీ నుంచే దేశ రాజకీయాలు చేయాలా? హైదరాబాద్ కేంద్రంగానే బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇక్కడ్నుంచే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని అన్నారు. ఇక, కేంద్రం ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతుగా పార్లమెంటులో ఓటేస్తామని కేటీఆర్ తెలిపారు. కేజ్రీవాల్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+