జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా?: కోడంగల్‌లో కేటీఆర్
మహబూబ్‌నగర్: జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా కొడంగల్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరెంట్ పోయిందని విమర్శించారు కేటీఆర్. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించామా? అని అక్కడి ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ కాదని 5 గంటల కరెంటు ఇస్తామని నేతలు అంటున్నారు. కొడంగల్ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.

రూ. 50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేంద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా ఆయనకు ప్రమోషన్ ఇప్సిస్తానని అన్నారు కేటీఆర్. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలో..? జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలా?.. ప్రజలే తేల్చుకోవాలంటూ రేవంత్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ అంధకారంలోకి వెళుతుందన్నారు.

We are winning in Kodangal Again ✊
— KTR (@KTRBRS) November 9, 2023
Thanks for the ❤️ today 🙏 pic.twitter.com/JY4EojLGqE
వచ్చే రెండేళ్లలో కొడంగల్‌లోని 1.25 లక్షల ఎకరాలకు కృష్ణా నీళ్లిస్తామన్నారు. ముద్దనూరును మున్సిపాలిటీగా చేసే బాధ్యత తానే తీసుకుంటానన్నారు కేటీఆర్. కొడంగల్‌లో ఆర్డీవో కార్యాలయం, 100 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం అవుతారన్నారు.












Click it and Unblock the Notifications