‘కుట్ర’ అని గూగుల్‌లో కొడితే కేటీఆర్ ఫోటోలు వస్తున్నాయి: శ్రవణ్
హైదరాబాద్: తెలంగాణ ఇచ్చిన విధానంపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేస్తుంటే మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలు ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ఆదివారం ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని మోడీ తూలనాడుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు సభలో ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. బడ్జెట్‌లో నిధులు తేలేకపోయినా టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. బీజేపీతో లోపాయకారి లాలూచీ ఏమిటో చెప్పాలని నిలదీసారు.

మోడీతో ఉన్న రహస్య ఒప్పందాలు బయటపెట్టాలన్నారు. గూగుల్‌లో కుట్ర అని టైప్ చేస్తే కేటీఆర్ ఫోటోలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. మోడీతో రహస్యచ ఒప్పందాలపై గన్ పార్క్ దగ్గర బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications