హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ నుంచి కేసీఆర్ ఆరా: అత్యధికమన్న కేటీఆర్, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గురువారం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి నగరంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. నగరంలోని నాలాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలో హైదరాబాద్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలో మార్పులు చూడొచ్చని అన్నారు.

ప్రజలకు ఇబ్బందులు తగ్గిస్తామన హామీ ఇస్తున్నానని చెప్పారు. ఇంకా మూడు రోజులు పాటు వర్షాలు కురిసే సూచన ఉండటంతో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వార్షిక సగటు వర్షపాతం 32 సెం.మీ అని తెలిపారు. కానీ ఒక్క గురువారమే ఈ ప్రాంతంలో సుమారు 23 సెం.మీ వర్షం కురిసిందని అన్నారు.

ktr inspection on hyderabad rains

భారీ వ‌ర్షాల‌తో అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయని అన్నారు. దీంతో నిజాంపేటతోపాటు పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని వివరించారు. ఇలాంటి ప్రకృతి వైఫరీత్యాలు ఏర్పడినపుడు ప్రభుత్వం చేసే సహాయ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు 48 గంటల నుంచి 72 గంటలపాటు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన సూచించారు.

ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తే ప్రభుత్వానికి సహాయ చర్యలు చేపట్టడం సులభమవుతుందని విజ్ఞప్తి చేశారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో అధికారులకు ఫోన్ చేయాల‌ని సూచించారు. అవసరమైన చోట అన్ని సహాయ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్, విద్యుత్, పోలీసు, వాటర్ వర్క్స్ నాలుగు శాఖల అధికారులు సమన్వయంలో పనిచేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాయని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సీఎం కేసీఆర్ ఫోన్

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యనటలో ఉన్న సీఎం కేసీఆర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డికి ఫోన్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో నెలకొన్న పరిస్థితులపై కమిషనర్‌ని సీఎం ఆరా తీశారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైతే ఆర్మీ సహాయం తీసుకోవాలని కమిషనర్‌కు సీఎం సూచించారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేయాలని కమిషనర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.

English summary
Telangana IT Mnister ktr inspection on hyderabad rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X