Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ రెండే మా ఓటమికి కారణాలు - కేటీఆర్..!!

తెలంగాణలో వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అన్నింటా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమాగా చెబుతోంది. బీఆర్ఎస్ సైతం భారీ అంచనాలతో ఉంది. బీజేపీ ఈ సారి గణనీయంగా సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సైతం మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.

మరోసారి విజయం
తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లోనూ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను చూడాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఒక వైపు బిట్స్ పిలానీలో చదువుకున్న అభ్యర్థి , మరో పార్టీ వైపు బ్లాక్ మెయిలర్, లాబీయింగ్ ..పైశాచిక ఆనందం పొందే అభ్యర్థి ఉన్నారని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

KTR interesting analysis over party defeat in Telangana Assembly Elections

దేవుడి పేరుతో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య గుడి కట్టారని చెబుతూ.. బీజేపీ అభ్యర్థి ఓట్లు అడుగుతున్నారని.. తాము యాదాద్రి గుడి కట్టామని... గుడి పేరుతో తాము ఇంతవరకు ఓట్లు అడగలేదని చెప్పారు. తాము ప్రాజెక్టులు కట్టామని.. అవి కూడా దేవుళ్ల పేరు మీద కట్టామని అయినా తాము దేవుడి పేరుతో ఏ ఎన్నికల్లోనూ ఓట్లు అడగట్లేదని స్పస్టం చేశారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు ఒక మెడికల్ కళాశాల కూడా లేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు మెడికల్ కళాశాలను ప్రకటించారని తెలిపారు.

ఓటమి కారణాలు
అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి రెండు కారణాలు ఉన్నాయని.. ఒకటి చేసిన పనిని చెప్పుకోలేదని.. రెండోది కొన్నివర్గాలను దూరం చేసుకోవడంతోనే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నాట్లు వేస్తున్నప్పుడు రైతు బంధు వచ్చింది.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఓట్లు వేస్తున్నప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇక..లోక్ సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించబోతోందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+