కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం: మునుగోడులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర ప్రచారం

మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందడి కొనసాగుతుంది. మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించాలని ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వంలో దూకుడు పెంచాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ముఖ్యనాయకులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.

మునుగోడులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర ప్రచారం

మునుగోడులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర ప్రచారం

ఇక మునుగోడులో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు అధికార పార్టీ మంత్రులు చేస్తున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడంతోపాటు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరికి వారు ఆసక్తికర రాజకీయాలకు తెరతీశారు. తాజాగా ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకున్న క్రమంలో మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంది కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆసక్తికర ప్రచారం నిర్వహించారు.

కేసీఆర్ తర్వాత కేటీఆర్ నే సీఎం అంటూ ప్రచారం

కేసీఆర్ తర్వాత కేటీఆర్ నే సీఎం అంటూ ప్రచారం

నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మునుగోడులో ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చేస్తున్న ఆయన మరోమారు కేటీఆర్ కాబోయే సీఎం అంటూ ప్రచారం చేయడంతో, ఆయన బాటలోనే మరికొందరు నేతలు కేటీఆర్ భవిష్యత్తు తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేస్తున్నారు. మునుగోడులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించటం మాత్రమే కాకుండా, మునుగోడు ఉప ఎన్నికల కీలక రాజకీయాలు చేస్తున్న మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఆయనే భవిష్యత్ ముఖ్యమంత్రి అని చేస్తున్న ప్రచారం ప్రస్తుతం మునుగోడులో ఆసక్తికరంగా మారింది.

మునుగోడు అభివృద్ధికి టీఆర్ఎస్ కే ఓటు వెయ్యాలంటున్న గులాబీ మంత్రులు

మునుగోడు అభివృద్ధికి టీఆర్ఎస్ కే ఓటు వెయ్యాలంటున్న గులాబీ మంత్రులు


ఇదిలా ఉంటే మునుగోడు నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి తమకు కేటాయించిన గ్రామాలు, మండలాల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. మొత్తం 86 యూనిట్లుగా మునుగోడు నియోజకవర్గాన్ని విభజించిన టిఆర్ఎస్ పార్టీ ఒక్కో యూనిట్ కు ఒక్కో ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుంది. మునుగోడు అభివృద్ధి చెందాలంటే అధికార టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని మునుగోడులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+