Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ చేతికి బీఆర్ఎస్ తాజా అస్త్రం - జోరుగా ప్రచారం..!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది. బీజేపీ సామాజిక సమీకరణాల ఆధారంగా ముందుకు వెళ్తోంది. హోరా హోరీ ప్రచారంతో పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి కేటీఆర్ రైతు బంధు పైన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతు బంధు అమలు విషయంలో పరిమితులు గురించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు అస్త్రంగా మారుతున్నాయి.

బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ : బీఆర్ఎస్ పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారం ప్రారంబించింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు..అవి అమలు కాకపోవం పైన డిజిటల్ మీడియా ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అటు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ పథకాలకు పోటీగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించింది. ఇప్పుడు వీటి ఆధారంగానే ప్రజలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

KTR latest comments on Rythubandu limitations becomes political weapon for T Congress

రైతు బంధు పథకం ద్వారా బీఆర్ఎస్ ఇప్పటి వరకు రూ 10 వేలు ఇస్తోంది. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే రూ 15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ దీనిని రూ 16 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ రైతుబంధుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు.

కేటీఆర్ వ్యాఖ్యల కలకలం : మంత్రి కేటీఆర్ తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. రైతు బంధు పథకం విషయంలో భూ పరిమితి పెట్టాలనే అభిప్రాయం బాగా ఉందని చెప్పుకొచ్చారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత రైతు బంధుపై పరిమితి అంశం పరిశీలించి కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ పథకం కింద లబ్ధి పొందే రైతులకుండాల్సిన భూమిని.. 4 లేదా 5 ఎకరాలకు పరిమితం చేయటం గురించి పరిశీలన చేస్తామని వివరించారు.

తెలంగాణలో ఎక్కువ భూమి ఉన్న రైతులు చాలా మంది ఉన్నారని.. దీంతో వారికి రైతుబంధు నగదు అంతే స్థాయిలో వస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రచారాస్త్రంగా మారాయి. రైతుబంధు తమ ఘనతగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పరిమితులు విధిస్తామని చెప్పటం ద్వారా రైతులకు నష్టం జరుగుతుందని హెచ్చరిస్తోంది.

KTR latest comments on Rythubandu limitations becomes political weapon for T Congress

నామినేషన్ల సందడి : మరో వైపు నామినేషన్లకు రేప చివరి రోజు కావటం..ఈ రోజు మంచి ముహూర్తం ఉండటంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయి. పార్టీలకు అతీతంగా ప్రముఖ నేతలంతా ఈ రోజున తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలోనూ ఈ రోజే నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మధిరలో భట్టి, పాలేరులో పొంగులేటి నామినేషన్లు ఫైల్ చేస్తున్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రేపు (శుక్రవారం) కామారెడ్డి లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రేవంత్ కామారెడ్డి నుంచి బరిలో ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రేపు కామారెడ్డిలో జరిగే కాంగ్రెస్ సభలో పాల్గొంటారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారని పార్టీ నేతల సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+