హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రామాకేర్ సెంటర్, కేటీఆర్‌కి 50వేలడాలర్లు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ ఐటీ సంస్థ హ్యాలెట్ ఫ్యాకర్డ్ (హెచ్‌పీ) సామాజిక బాధ్యతగా హైదరాబాదులో ట్రామాకేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సుపర్ణో బెనర్జీతో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను, ఐటీ రంగంలో హైదరాబాదుకు ఉన్న ప్రత్యేకతను వివరించారు.

హెచ్‌పీ ప్రింటర్ల తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ పలు కీలక భేటీల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ విమాన యాన సంస్థ బోయింగ్ కంపెనీ అధ్యక్షుడు మార్క్ అలెన్‌ను కలిసి, తెలంగాణలో విమానల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం విమానయానరంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో విమాన తయారీ కేంద్రం ఏర్పాటును ఆలోచిస్తున్నామని బోయింగ్ కంపెనీ అధ్యక్షుడు తెలిపారు. త్వరలోనే కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్రానికి వస్తుందని చెప్పారు. కేటీఆర్ బుధవారం తొలి రోజు వాషింగ్టన్ డిసిలో జరిగిన పలు సమావేశాల్లో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. అమెరికాలో భారత రాయబారి అరుణ్ కుమార్ సింగ్‌తో విందు సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా- భారత బిజినెస్ కౌన్సిల్ (యుఎస్‌ఐబిసి) సీనియర్ ప్రతినిధుల నేతృత్వంలో రాయబారిని కలిసిన మంత్రి కేటీఆర్ పది నెలల కాలంలో తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పారిశ్రామిక విధానం గురించి వివరించారు.

కేటీఆర్

కేటీఆర్

ఫోర్డ్ మోటార్ కంపెనీ, లాకిహడ్ మార్టిన్ , ఫైజర్ , విప్రో, మాస్టర్ కార్డ్ కంపెనీల నుంచి సీనియర్ ప్రతినిధులతో ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.

కేటీఆర్

కేటీఆర్

ఏక్ లాట్ హెల్త్ సొల్యూషన్స్ వైఎస్ ప్రెసిడెంట్ జెర్రీ జోర్గెన్నెస్ కేటీఆర్‌ను కలిసి ఆరు నెలల్లో 200 మంది ఉద్యోగులతో కరీంనగర్‌లో ఒక ఆరోగ్య (కెపిఓ) అనలైటిక్ కంపెనీ ప్రారంభించనున్నట్టు చెప్పారు.

 కేటీఆర్

కేటీఆర్

అనంతరం వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగు వారు, వృత్తి నిపుణులు ఎన్‌ఆర్‌ఐలు హాజరైన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.

 కేటీఆర్

కేటీఆర్

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి వాషింగ్టన్ డిసి ఎన్నారైలు 50వేల అమెరికన్ డాలర్ల విరాళాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

English summary
Information Technology Minister K.T. Rama Rao and four other members of his team began their two-week tour of United States of America on Thursday by meeting Indian Ambassador Arun Kumar Singh at Washington DC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X