హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్ష్య సాధనలో మరో ముందడుగు: మంత్రి కేటీఆర్ (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు శుక్రవారం నుంచి పూర్తిస్తాయిలో అందుబాటులోకి వచ్చింది. ఘట్‌కేసర్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు నిర్మించిన 21 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను నిల‌బెట్టే ల‌క్ష్యంలో మ‌రో ముందడుగు వేశామ‌ని అన్నారు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.5,304 కోట్ల వ్యయం ఖర్చు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.

158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌ నగరానికి మణిహారం అని పేర్కొన్నారు. ఈ ఔటర్‌ రింగ్‌రోడ్డు 21 కిలోమీటర్ల పొడవుతో నిర్మిత‌మ‌యింది. రింగ్ రోడ్డుని పూర్తి స్థాయిలో నేటి నుంచి ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు.

 ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

దీంతో దాదాపుగా పూర్తిస్థాయిలో 99 శాతం ఔటర్ రింగ్ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. 71 కిలోమీటర్ల సర్వీసు రోడ్లను 2017లోగా పూర్తి చేస్తామని అన్నారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకు మొత్తం 316 కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు ఉందని ఆయన అన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

రూ.30 కోట్ల వ్యయంతో గచ్చిబౌలి నుంచి శామీర్‌పేట వరకు ఎల్‌ఈడీ లైటింగ్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. తద్వారా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 13 గ్రోత్ కారిడార్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్ తరాల కోసం 292 కిలోమీటర్ల రీజియనల్ రింగ్ రోడ్డులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.

 ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

దీనికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. కొత్త రింగ్ రోడ్డు వద్ద మొక్కలను నాటడాన్ని ఆయన అభినందించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో పది కోట్ల మొక్కలను నాటుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

ఈ కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, పద్మారావు, హైదరబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

 ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

తాజా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి రావడంతో దేశంలోనే అత్యంత పొడవైన ఔటర్‌ రింగ్‌రోడ్డుగా హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు రికార్డుల్లో ఎక్కింది.

ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్‌కే మణిహారం: కేటీఆర్

2006లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు 2006లో శంకుస్థాపన చేశారు. ఘట్కేసర్ నుంచి శంషాబాద్ వరకు దాదాపు 21.3 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణం ఇటీవలే పూర్తి అయింది.

English summary
The Stretch of Outer Ring Road for a length of 21.3 Km between Shamirpet and Ghatkesar is scheduled to be inaugurated by Sri K. Taraka Rama Rao, Hon’ble Minister for IT, MA & UD on 15-07-2016 at 12:00 noon at Ghatkesar. This stretch of ORR has been funded by JICA. Representatives of Japan Embassy and JICA will participate in the inaugural function.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X