ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ హైదరాబాద్: కెటిఆర్, చెత్తబుట్టల పంపిణీ(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రజలందరి సహకారంతోనే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమవుతుందని ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. బేగంపేట డివిజన్ సింధ్‌కాలనీలోని సిల్వర్‌జూబ్లీ అపార్ట్‌మెంట్‌లో ఆయన మంగళవారం మహిళలకు తడి, పొడి చెత్తడబ్బాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ట్రాలీ ఆటోలను పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. క్లీన్‌సిటీ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ కోసం నిర్ణీత వైశాల్యం పరిధిలో ప్రత్యేక అధికారులను నియమించినట్టు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.నగర వ్యాప్తంగా చెత్తను తరలించేందుకు ప్రభుత్వం రెండు వేల ట్రాలీ ఆటోలను మంజూరు చేసిందన్నారు. అలాగే, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు త్వరలో నగరంలో విస్తృతంగా పర్యటిస్తామని చెప్పారు.
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరాభివృధ్ధికి వంద కోట్లతో నాలాల మళ్లింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, సికింద్రాబాద్ మున్సిపల్ జోనల్ కమిషనర్ హరిచందన, డిప్యూటి కమీషనర్ విజయరాజ్, స్ధానిక టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కెటిఆర్
ప్రజలందరి సహకారంతోనే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమవుతుందని ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు.

కెటిఆర్
బేగంపేట డివిజన్ సింధ్‌కాలనీలోని సిల్వర్‌జూబ్లీ అపార్ట్‌మెంట్‌లో ఆయన మంగళవారం మహిళలకు తడి, పొడి చెత్తడబ్బాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ట్రాలీ ఆటోలను పంపిణీ చేశారు.

కెటిఆర్
అనంతరం మాట్లాడుతూ.. క్లీన్‌సిటీ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ కోసం నిర్ణీత వైశాల్యం పరిధిలో ప్రత్యేక అధికారులను నియమించినట్టు తెలిపారు.

కెటిఆర్
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
నగర వ్యాప్తంగా చెత్తను తరలించేందుకు ప్రభుత్వం రెండు వేల ట్రాలీ ఆటోలను మంజూరు చేసిందన్నారు.

కెటిఆర్
అలాగే, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు త్వరలో నగరంలో విస్తృతంగా పర్యటిస్తామని చెప్పారు.

కెటిఆర్
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరాభివృధ్ధికి వంద కోట్లతో నాలాల మళ్లింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

కెటిఆర్
కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, సికింద్రాబాద్ మున్సిపల్ జోనల్ కమిషనర్ హరిచందన, డిప్యూటి కమీషనర్ విజయరాజ్, స్ధానిక టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కెటిఆర్
ప్రజలందరి సహకారంతోనే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమవుతుందని ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు.












Click it and Unblock the Notifications