పోద్దున చెల్లి ఇలా...సాయంత్రం అన్నా అలా..కవిత,కేటీఆర్ మాటల మధ్య ఇంత తేడా ఎందుకు ?
Recommended Video

ఓవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలింగ్ సిబ్బంది బ్రహ్మండంగా పనిచేశారని చెబుతుంటే ఆయన చెల్లెలు నిజమాబాద్ ఎంపీ కల్వకుట్ల కవిత మాత్రం తీవ్రంగా మండిపడ్డారు. ఒక్కపూటలోనే ఇద్దరు అగ్రనేతల అభిప్రాయాల్లో తేడాలు ఉన్నాయి.ఇంతకి ఎలక్షన్ కమీషన్ పకడ్బంధిగా ఎన్నికలు నిర్వహించిందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
I am proud of the way Telangana conducted itself today in this important parliament election🤘👍
— KTR (@KTRTRS) April 11, 2019
Proud of the administrative machinery, EC & Govt officials, political party workers of All parties & above all the people of Telangana🙏🙏
Only let down was the low turnout in towns
ఎన్నికల అధికారులను ప్రశంసించిన కేటీఆర్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ముగిశాయి.అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ శాతం ఓటింగ్ పోలైంది. అది మహనగరంలోనైతే దారుణంగా పడిపోయింది.కాగా ఇదే అంశాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ చాల అద్బుతంగా కొనసాగిందని ,ఇందుకోసం ఎన్నికల అధికారులు చాల శ్రమించి పనిచేశారని,ఇందుకోసం రాజకీయ పార్టీలు ,కూడ తమవంతు బాధ్యతను నిర్వహించాయని అన్నారు.ఈనేపథ్యంలోనే ఓటింగ్ తక్కువగా నమోదు కావడంపై కూడ ఆయన వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతంలో ఓటింగ్ తక్కువ నమోదు కావడం పై ఆయన చర్చించారు.

నిజామాబాద్ లో పోలింగ్ సిబ్బందిపై ఫైర్ అయిన కవిత
కాగా కేటీఆర్ సోదరి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మాత్రం నిజామాబాద్ లో జరిగిన ఎన్నికల ఏర్పాట్ల తీరుపై మండిపడ్డారు. తన ఓటు వేసేందుకు కనీసం గంటపాటు క్యూలైన్ లో వేచి ఉన్నారు.ముఖ్యంగా నిజామాబాద్ లో ఎక్కువమంది అభ్యర్థులు పోటి చేయడంతో ఈవిఎం ఏర్పాటు ఓ ప్రహసనంగా మారింది.దీంతో నవీపేట్ మండలంలోని పోతంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమే మీడియాతో మాట్లాడారు.ఈనేపథ్యంలోనే ఈవీఎంకు నెంబర్లు సరిగా వేయకపోవడంతోపాటు, పోలింగ్ బూత్ లోపలకి బయటికి వెళ్లడానికి ప్రత్యేక దారులు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ముఖ్యంగా వృద్దులకు కనిపించే విధంగా ఈవీఎంలకు నెంబర్లు కూడ వేయలేదన్నారు. దీనికి తోడు ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తడంతో 8 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ 45 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఆమే ఓటు హక్కు వినియోగించుకోవాడానికి క్యూ లైన్ల్ లో వేచి ఉండాల్సివచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ఎన్నికల నిర్వహాణ తీరుపై ఆమే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వాహణ తెలంగాణలో పూర్తిగా సంతృప్తిగా జరిగిందని కేటీఆర్ చెబితే అందుకు విరుద్దంగా కవిత స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ఓకే పార్టీలో రేండు వేర్వేరు అభిప్రాయాలు రావడంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళం నెలకోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications