నటి సమంతపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్: ఎందుకంటే..(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నేతను ప్రోత్సహించేలా హీరోయిన్ సమంత ముందుడుగు వేయడం పట్ల తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) హర్షం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు దుబ్బాక, పోచంపల్లిలో సమంత పర్యటించడం మంచి పరిణామమని ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

చీర, శాలువా బహూకరణ

చీర, శాలువా బహూకరణ

చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపట్టిన కార్యక్రమానికి మద్దతు పలకడంతో సమంతకు గతంలో మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక, పోచంపల్లి చీర, శాలువాను ఆమెకు బహూకరించారు.

చేనేత ప్రచారకర్తగా..

చేనేత ప్రచారకర్తగా..

తెలంగాణ చేనేత ప్రచారకర్తగా ఉన్న టాలీవుడ్ నటి సమంత మార్చి 10న సిద్దిపేటలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు చేనేత సహకార సంఘాలను సందర్శించారు. చేనేత కార్మికులను కలసి వారి కష్టసుఖాల గురించి ఆరా తీశారు.

దుబ్బక, పోచంపల్లిలోనూ..

దుబ్బక, పోచంపల్లిలోనూ..

ఆ తర్వాత దుబ్బాక చేనేత సహకార సంఘానికి వెళ్లి మగ్గాల మీద తయారు చేస్తున్న వస్త్రాలను సమంత పరిశీలించారు. మార్చి 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని హ్యాండ్లూమ్‌ పార్క్‌ను కూడా ఆమె సందర్శించారు.

సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ..

సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ..

మగ్గాలపై తయారు చేసిన వివిధ రకాల ఇక్కత్‌ వస్త్రాలను, డిజైన్లను పరిశీలించారు. చేనేత సంఘం పనితీరు, నేత కార్మికుల నైపుణ్యాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్తానని ఈ సందర్భంగా సమంత చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana minister KT Rama Rao on Friday did a praising tweet on Actress and telangana weavers brand ambassador Samantha.
Please Wait while comments are loading...