ఆ సమస్యపై..: కేటీఆర్‌కు యాంకర్ ప్రదీప్ ట్వీట్, క్షణాల్లో స్పందన..

Subscribe to Oneindia Telugu
  KTR Immediate Action On Anchor Pradeep's Tweet

  హైదరాబాద్: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. అధికారులను పురమాయించి యుద్దప్రాతిపదికన సమస్య పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. తాజాగా టీవీ యాంకర్ ప్రదీప్ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి ఓ సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. అధికారులను చర్యలకు ఆదేశించారు.

  'టాయిలెట్ లేని పాఠశాల' :

  'టాయిలెట్ లేని పాఠశాల' పేరుతో ఓ స్వచ్చంద సంస్థ ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టింది. చర్లపల్లిలో 40ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాలకు ఇప్పటికీ టాయిలెట్ వసతి లేదని, స్కూల్లో చదువుకుంటున్న 120మంది బాలికలు, 100మంది బాలురు ఇబ్బందులు పడుతున్నారని ట్వీట్ ద్వారా ఆ ఎన్జీవో తెలియజేసింది.

  టాయిలెట్ లేని కారణంగా విద్యార్థులు భోజనం తర్వాత మంచినీళ్లు కూడా తాగడం లేదని.. నీళ్లు తాగితే టాయిలెట్ కోసం చాలాదూరం వెళ్లాల్సి వస్తోందన్న కారణంతోనే ఇలా చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్‌కు కేటీఆర్‌ను కూడా ట్యాగ్ చేసింది.

  కేటీఆర్‌కు ప్రదీప్ విజ్ఞప్తి:

  ఎన్జీవో చేసిన ట్వీట్‌పై యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్పందించారు. తమ టీమ్ ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి సమస్యను పరిశీలించిందని.. నిజంగానే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయని, ప్రధానంగా బాలికల సమస్య కోసం ఏదైనా చేయాలని ట్విట్టర్ ద్వారా ఆయన కేటీఆర్‌ను కోరారు.

  చర్యలకు కేటీఆర్ ఆదేశం..:

  ప్రదీప్ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. పని పూర్తయ్యాక ఆ ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని అన్నారు. అందుకు అనుగుణంగా మేడ్చల్ కలెక్టర్ నుంచి కూడా స్పందన రావడం విశేషం. 'సార్.. డీఈవో రేపు వెళ్లి ఆ పాఠశాల టాయిలెట్లను పరిశీలిస్తారు. పాత టాయిలెట్ల స్థానంలో కొత్తవి నిర్మించడానికి చర్యలు తీసుకుంటాం' అంటూ ట్వీట్ చేశారు.

  కేటీఆర్‌కు 10 లక్షలు ఫాలోవర్స్

  ట్విట్టర్‌లో కేటీఆర్ దూసుకెళ్తున్నారు. ఆయన ఫాలోవర్స్ సంఖ్య ఇటీవలే 10 లక్షలు దాటింది. ఈ సందర్భంగా తనను ఫాలో అవుతున్న నెటిజన్స్ అందరికీ మిలియన్ థ్యాంక్స్ చెప్పారు కేటీఆర్. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు.. అభివృద్ధి పనులను తెలియజేసేందుకు ఆయన ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana IT Minister KTR responded on Anchor Pradeep Machiraju tweet over toilet issue in Govt school Charlapalli. KTR given assurance to take immediate action.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి