• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూల్ న్యూస్ .. తెలంగాణాలో ఆ ఇళ్ళ నిర్మాణాలకు అనుమతి అక్కరలేదన్న సర్కార్

|

తెలంగాణా మున్సిపల్ మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడమే కాకుండా, మున్సిపల్ చట్టాన్ని కూడా పకడ్బందీగా రూపొందించింది. టీఎస్ బి పాస్ బిల్లుతో పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నిజంగానే పేద ,మధ్యతరగతి వర్గాలు గృహ నిర్మాణాల అనుమతుల కోసం వ్యయ ప్రయాసలకు లోను కాకుండా ఉండేలా చక్కని వెసులుబాటు కల్పిస్తూ కూల్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 75 చదరపు గజాల స్థలంలో నిర్మాణానికి అనుమతి అవసరం లేదు.

న్ని లేఖలు రాసినా ఉలుకూ పలుకూ లేదు .. కేంద్రం సహకరించటం లేదు : కేటీఆర్ ఫైర్

ఇక ఆ వివరాలను చూస్తే..

ఇక ఆ వివరాలను చూస్తే..

మునిసిపాలిటీల పరిధిలో 75 చదరపు గజాల స్థలంలో నిర్మాణానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని గుడ్ న్యూస్ చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఇది నిజంగా నగర వాసులకు శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు 75 చదరపు గజాల స్థలం అయినప్పటికీ గృహ నిర్మాణ అనుమతులకు పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే టీఎస్ బీ పాస్ బిల్లు ద్వారా 75 గజాల వరకు స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు .

76 నుంచి 600 చదరపు గజాలలో నిర్మాణాలకు స్వీయ ధృవీకరణతో తక్షణ అనుమతి

76 నుంచి 600 చదరపు గజాలలో నిర్మాణాలకు స్వీయ ధృవీకరణతో తక్షణ అనుమతి

76 నుంచి 600 చదరపు గజాల ప్లాట్లలో విస్తీర్ణంలో ని ప్లాట్లలో నిర్మాణాలకు స్వీయ ధృవీకరణ ఆధారంగా తక్షణ ఆమోదం లభించనుందని పేర్కొన్నారు. అంతేకాదు 600 చదరపు గజాలకు పైగా స్థలం ఉన్న వారికి ఇరవై ఒక్క రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 21 రోజుల్లో పర్మిషన్ రాకపోతే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ వస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు .ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇస్తామని పేర్కొన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల కోసం మునిసిపాలిటీల చుట్టూ, మున్సిపల్ కార్పొరేషన్ ల చుట్టూ ప్రదిక్షణలు చేయవలసి వచ్చేది.

అనుమతి అవసరం లేకున్నా ఆన్ లైన్ లో వివరాలు నమోదు తప్పనిసరి

అనుమతి అవసరం లేకున్నా ఆన్ లైన్ లో వివరాలు నమోదు తప్పనిసరి

ప్రస్తుతం టి ఎస్ బి పాస్ బిల్లు ద్వారా నిర్మాణ అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే అనుమతులు వచ్చేలా నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించిన నిబంధనలు విషయానికి వస్తే 75 చదరపు గజాల వరకు స్థలాలలో భవన నిర్మాణానికి అనుమతి అవసరం లేదు. టోకెన్ ఫీజు ఒక రూపాయి చెల్లించి, ఆన్లైన్లో భవన నిర్మాణ వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. ఇక దానితో పాటు వంద రూపాయల ఆస్తి పన్నును కూడా చెల్లించాలి.

  Telangana Assembly Passes Resolution Demanding Bharat Ratna For PV Narasimha Rao
  సులభతరమైన నిబంధనలే .. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే !!

  సులభతరమైన నిబంధనలే .. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే !!

  ప్రభుత్వ భూముల్లోనూ, జలవనరుల ప్రదేశాల్లోనూ, ఇతర నిషేధిత భూములలో ఎక్కడా తమకు ప్లాట్ లేదని స్వయంగా ధృవీకరించడం తో పాటుగా, ప్రస్తుతం నిర్మించే భవనానికి సంబంధించిన వివరాలు, ఎన్ని అంతస్తుల నిర్మాణం అనే అంశాలను కూడా ధ్రువీకరించాలి. 10 మీటర్ల ఎత్తు ఉన్న భవన నిర్మాణానికి తక్షణ ఆమోదం లభిస్తుంది. 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనానికి 21 రోజుల లోపల అనుమతి లభిస్తుంది. అనుమతి లభించిన తర్వాతనే భవన నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించటం కానీ, కూల్చివేత చర్యలకు దిగడం గాని జరుగుతుందని టిఎస్ బి పాస్ బిల్లులో పేర్కొన్నారు.

  English summary
  Good News does not require permission to build on 75 square yards of land within municipalities, said Municipal Minister KTR. This is because even though it is 75 square yards of land so far, poor, middle class people have to face severe difficulties in getting housing permits. It is in this context that the TS B Pass Bill states that permission is not required to build a house on land up to 75 yards..
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X