KTR: ఇప్పట్లో తెలంగాణలో ఎన్నికలు కష్టమే.. కేటీఆర్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆక్టోబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఆధారపడి ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశాల తర్వాత తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అనే దానికి క్లారిటీ వస్తుందని కేటిఆర్ తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎన్నికలు జరగాలంటే అకోబర్ 10 లోపు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఆ లోపు నోటిఫికేష్ వస్తేనే నవంబర్ లో ఎన్నికలు జరగుతాయని లేకుంటే ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై ప్రధాని మోడీ భయపడతున్నారని విమర్శించారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే..ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని వారు భావిస్తున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అయితే మధ్యప్రదేశ్ లో ఒక్క దగ్గరే బీజేపీ కి అవకాశం ఉందని, మిగతా రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం కష్టమే జోస్యం చెప్పారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి వస్తే తమకే లాభమని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆరేస్ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనూ పోటీ చేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు సెట్ అవుతారని చెప్పారు. మోడీని తాము తిట్టినంతగా ఎవరు తిట్టలేదన్నారు.












Click it and Unblock the Notifications