సైకిల్ పార్టీని మరిచారు, ఏపీకి దోచి పెడుతున్నారు: మోడీపై కేటీఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఖమ్మం: తెలంగాణలో సైకిల్ పార్టీని ఇక్కడి ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

ఫ్రొఫెసరా?: కోదండరాంపై తొలిసారి హరీశ్, వైయస్‌నూ లాగారు!

ఖమ్మంలో ఐట్ హబ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో వామపక్షాలు అదృశ్యమయ్యాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR says there is no Cycle party in Telangana

మూడేళ్ల తమ పాలనలో ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టామని, ఒంటరి మహిళకు దేశంలోనే తొలిసారిగా పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని, విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దోచిపెట్టిందని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. దీనిపై కేంద్రం స్పందించడం లేదన్నారు. మూడేళ్లలో తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana IT minister KT Rama Rao on Wednesday said that there is no Cycle party in Telangana state after division.
Please Wait while comments are loading...