జూటాకోరు పార్టీ, దగాకోరు వంచనయాత్ర: దోపిడీకి జైకొడతారా? అంటూ బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్‌కు పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని, ఆయన చేపట్టినది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని విమర్శించారు. కృష్ణా జిల్లాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జల దోపిడీకి జై కొడతారా? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ యాత్రలు చేస్తారా? అని కేటీఆర్ నిలదీశారు.

జూటాకోరు పార్టీ.. దగాకోరు యాత్ర: బండి సంజయ్ యాత్రపై కేటీఆర్
జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని విమర్శించారు. పచ్చ బడుతున్న పాలమూరుపై కక్ష కట్టిన బీజేపీ నేతలకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదని కేటీఆర్ అన్నారు. పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా..? అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు కేటీఆర్. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తున్నారు మండిపడ్డారు మంత్రి కేటీఆర్.

కపట యాత్రలు, పాలమూరు మీద కక్ష అంటూ కేటీఆర్
పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా..? అని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరుకు ఇంతవరకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ బండి సంజయ్‌ను ఆ లేఖలో ప్రశ్నించారు. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారో ... సమాధానం చెప్పాలి? అని కేటీర్ డిమాండ్ చేశారు.

తెలంగాణ అంటే గిట్టని పార్టీ, రైతు ద్రోహ యాత్ర: బీజేపీ, బండిపై కేటీఆర్ ఫైర్
నీతిఆయోగ్ చెప్పినా? నిధులిచ్చే నీతి లేదు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బ్లాక్ మెయిల్ చేస్తారా? తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బీజేపీ. కడుపులో ద్వేషం పెట్టుకుని కపటయాత్రలు చేస్తే ఏం లాభం?. పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా..? అవి కేటీఆర్ బండి సంజయ్‌ను నిలదీశారు.












Click it and Unblock the Notifications