థర్డ్ గ్రేడ్ నాలాయక్స్‌ను నమ్ముకుంటే అవి గ్యారెంటీ: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రకటించిన అయిుదు గ్యారంటీపై అధికార భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే అధోగతి పాలు కాకతప్పదంటూ హెచ్చరించారు.

కాంగ్రెస్ అర్ధశతాబ్దపు పాలన అంతా మోసం, వంచన, ద్రోహం, ధోఖాలమయమేనని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ అని, కల్లబొల్లి గ్యారెంటీలు ఇక్కడ చెల్లవని అన్నారు. రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ అని చెప్పారు.

KTR slams Congress 6 guarantees

కాలకేయుల కాలం వస్తే కరెంట్‌ కోతలు..కటిక చీకట్లు గ్యారెంటీ అని కేటీఆర్ చెప్పారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే
మూడు గంటల కరెంటే గతి, ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. దగాకోరుల పాలన వస్తే ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ అని తేల్చి చెప్పారు.

బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా..ధీమా గల్లంతవుతుందని, సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభం గ్యారెంటీ అని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీ ఎక్కితే, ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ అవుతుందని స్పష్టం చేశారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే, సంపదనంతా స్వాహా చేస్తారని విమర్శించారు.

భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే, బూడిద మిగులుతుందని, స్కాముల పార్టీకి స్వాగతం చెబితే స్కీములన్ని ఎత్తేయడం గ్యారెంటీ అని హెచ్చరించారు. కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే, అన్నదాత ఆగమైపోతాడని, పరిపాలన చేతగాని..చేవలేని వాళ్లకు పగ్గాలిస్తే పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ అని అన్నారు.

పనికిమాలిన వాళ్లు పవర్‌లోకి వస్తే, పరిశ్రమలు పారిపోతాయని, బుద్ధికుశలత లేనోళ్లకు చోటిస్తే భూముల ధరలు పడిపోతాయని, విషయం..విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే వికాసం మాయమై వినాశనం గ్యారెంటీ అవుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్ గ్రేడ్ నాలాయక్స్ ను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమస్థాయికిపోవడం గ్యారెంటీ అన్నారు.

ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ ఏట్లో గలవడం గ్యారెంటీనని, జోకర్లకు..బ్రోకర్లకు పీఠం ఇస్తే పరువు ప్రతిష్ఠలు గంగలో కలుస్తాయని కేటీఆర్ తేల్చి చెప్పారు. దాచి..దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు..నా తెలంగాణ, ఈనగాచి నక్కల పాల్జేసేంత
అమాయక నేల కాదు నా తెలంగాణ అంటూ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+