ఆ విషయంలో రేవంత్ రెడ్డిని వదిలిపెట్టని కేటీఆర్.. సంచలన పోస్ట్!

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన పైన బిఏఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. రైతు సంక్షేమాన్ని గారికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే దాకా చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం గా బాధ్యతలు నిర్వర్తించాల్సిన రేవంత్ రెడ్డి దృష్టి కన్నీరు పెడుతున్న రైతుల పైన లేదని పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు.

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కేటీఆర్
తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలంగాణలో రైతాంగం పరిస్థితిని రేవంత్ రెడ్డి చేస్తున్న పనులను మాజీ మంత్రి కేటీఆర్ ఎత్తిచూపారు. గుట్టలను మట్టి చేసి భూ దాహం తీర్చుకోవడం కాదు రేవంత్ గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశులు వైపు చూడు అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR targets cm revanth reddy over farmers paddy procurement made sensational post

ఢిల్లీ ముందు మోకరిల్లటం తప్ప చేస్తుందేంటి
గాలి మోటార్ లో మూటలు మోసుడు కాదు కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు అంటూ ఢిల్లీకి విమానాలలో డబ్బులు మూటలు మోసుకు వెళ్తున్నాడని టార్గెట్ చేశారు. ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడు అంటూ, రేవంత్ రెడ్డి దృష్టి అంతా ఢిల్లీ అధిష్టానం ముందు మోకరిల్లే పనిలోనే ఉందని రైతన్నలు బాధపడుతున్న పట్టించుకోవడంలేదని టార్గెట్ చేశారు.

నీ మూసి ముసుగులు కాదు.. రైతుల కన్నీళ్లు చూడు
కల్లబొల్లి మాటలతో కాలయాపన చేయడం కాదు ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చట ఏందో చూడు అంటూ రేవంత్ రెడ్డికి హితవు పలికారు నీ మూసి ముసుగులు కాదు కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతున్నల కన్నీళ్ళ వైపు చూడు అంటూ రేవంత్ రెడ్డి దృష్టి అంతా రైతుల పైన కాకుండా మూసి పైన ఉందని మండిపడ్డారు.

కకావికలం అవుతున్న రైతు బతుకు చూస్తున్నావా రేవంత్
ఇక అస్తమానం ఢిల్లీ యాత్రను చేస్తున్నారని గ్రామాలలో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్నా రైతుల ఆవేదన ఎవరు పట్టించుకోవడంలేదని ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రైతుల ఆవేదన కనపడడం లేదని టార్గెట్ చేశారు. నీ కాసుల కక్కుర్తి, నీ కేసుల కుట్రలు కాదు పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడు అంటూ రేవంత్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎగ్గొట్టడం మీద రేవంత్ రెడ్డి శ్రద్ధ
దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టావని, సన్న వడ్లకు సున్నం పెట్టావని ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలవడం పైన చూపాలని రేవంత్ రెడ్డి ని కేటీఆర్ టార్గెట్ చేశారు. కేటీఆర్ రైతాంగం కోసం రేవంత్ రెడ్డిని గత కొద్దిరోజులుగా నిత్యం టార్గెట్ చేసి మందిపడుతూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+