అమెరికాలో కేటీఆర్ బిజీ బిజీ - పెట్టుబడుల కోసం భేటీలు : ఎన్నారైల ఘన స్వాగతం..!!

తెలంగాణ ఐటీ - పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ అమెరికా చేరుకున్నారు. ఆయన వారం రోజుల పాటు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటించనున్నారు. ప్రఖ్యాత అంతర్జాతీయ పారిశ్రామిక ప్రముఖులతో సమావేశం కానున్నారు. లాస్ ఎంజిల్స్ చేరుకున్న కేటీఆర్ కు అక్కడి టీఆర్ఎస్ అభిమానులతో పాటుగా ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ శాన్ డియాగో.. సానో హూజే..బోస్టన్ .. న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించనున్నారు. ప్రముఖ కంపెనీల అధిపతులు..సీఈవోలతో సమావేశాలు ఏర్పాటు అయ్యాయి.

ఇప్పటికే హైదరాబాద్ లో పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించిన సమయంలో..మరింతగా విదేశీ సంస్థలను ఆకర్షించేందుకు కేటీఆర్ ఈ పర్యటనను సద్వినియోగం చేసుకోనున్నారు. ముఖ్యంగా ఐటి, ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో సమావేశమవుతారు. గతంలో అమెరికాలో పర్యటించి పెద్దఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చిన కేటీఆర్.. ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికాలోని తెలుగు వారితో కేటీఆర్ సమావేశమయ్యారు.

KTR to meet with MNC CEOs on inviting them for Investments in Telangana in his US tour

తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రంతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్ కు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రభుత్వ నిర్వహిస్తున్న మన ఊరు - మన బడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమెరికా లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. ఈ నెల 25వ తేదీ వరకు కేటీఆర్ అమెరికాలో పర్యటించనున్నారు. కేటీఆర్ తో పాటుగా తెలంగాణ ఐటీ .. పరిశ్రమల శాఖల ముఖ్య అధికారులు సైతం ఈ పర్యటనలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+