ఆటో ఎక్కిన కేటీఆర్.. ఎందుకో తెలుసా!!
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ నాయకులు కొత్త పంధాలో పయనిస్తున్న విషయం తెలిసిందే. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీతో ఉండే బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం రూటు మార్చారు. సామాన్య ప్రజలతో మమేకమవుతూ సామాన్య ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఆటోలో ప్రయాణం చేశారు.
రానున్న పార్లమెంటు ఎన్నికలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన కేటీఆర్, తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అసెంబ్లీ సమీక్ష సమావేశాలను కేటీఆర్ నిర్వహించారు. హైదరాబాద్ యూసఫ్ గూడా లో నిర్వహించిన జూబ్లీహిల్స్ సమీక్ష సమావేశంలో పలు అంశాల పైన కేటీఆర్ చర్చించారు.

ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత కేటీఆర్ తన కారులో వెళ్లకుండా ఆటోలో ప్రయాణం చేశారు. కేటీఆర్ తెలంగాణ భవన్ కు ఆటోలోనే వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచితబస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆటోవాలాల జీవనం దుర్భరంగా మారింది. ప్రస్తుతం ఆటోవాలాలు తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేకమార్లు ఆటోవాలాలు ఆందోళనలు చేసి ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేశారు.
బిఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశం ముగిసిన తరువాత యూసఫ్ గూడ నుండీ తెలంగాణ భవన్ కు ఆటోలో వెళ్లిన కేటీఆర్..!! pic.twitter.com/jqocMsXIZU
— oneindiatelugu (@oneindiatelugu) January 27, 2024
ఇక ఆటోవాలాలకు అండగా గతంలోనే తన వాయిస్ వినిపించిన కేటీఆర్ తాజాగా ఆటోలో ప్రయాణం చేసి మరోమారు ఆటోవాలాలకు మద్దతు తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఆటోలో ప్రయాణం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం తర్వాత ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఈ క్రమంలోనే ఆయన ఆటోలో ప్రయాణం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ఆటోలో ప్రయాణం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications