Ration Card kyc: తెలంగాణలో కొనసాగుతోన్న రేషన్ కార్డు లబ్ధిదారుల కేవైసీ..
తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజలు రేషన్ షాపులకు వెళ్లి కేవైసీ చేయించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం బోగస్ కార్డులను తొలగించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేవైసీకి ఎలాంటి గడవు విధించలేదు. కేవైసీ చేసుకుంటేనే రేషన్ వస్తుందని వార్తలు రావడంతో ప్రజలు రేషన్ షాప్ ముందు క్యూ కడుతున్నారు. అయితే కొందరికి బయోమెట్రిక్ సరిగా రావడంలేదు. దీంతో వారు ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.
కొందరికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయింది. వారు బయోమెట్రిక్ ఆన్ లాక్ చేసుకుని బయోమెట్రిక్ థంబ్ వేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రేషన్ కార్డు ఉన్న సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి థంబ్ వేస్తే బియ్యం తీసుకెళ్లేవారు. అయితే చాలా మంది ఇంటి సభ్యుల్లో ఎవరైనా చనిపోయినా వారి పేరు రేషన్ తీసుకుంటున్నారు.ప్రస్తుతం రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుటు రేషన్ షాప్ కు వెళ్లి వేలి ముద్ర వేసి కేవైసీ చేయించుకోవాలి. రేషన్ డీలర్లు ఈ పాస్ మిషన్లో ఈ వేలి ముద్రలు తీసుకుంటున్నారు.

రేషన్ షాపుకు వెళ్లి రేషన్ కార్డు నంబర్ చెప్పాలి. ఆ తర్వాత వేలి ముద్ర వేసినప్పుడు వారి వారి ఆధార్ కార్డు నంబర్ తో పాటు రేషన్ కార్డు నంబర్ కనిపిస్తుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వస్తే మీరు కేవైసీ విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు అవుతోంది. ఒకవేళ రెడ్ లైట్ వస్తే మీ ఆధార్ రేషన్ కార్డు తో సరిపోలేదని అర్థం అప్పుడు రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. కేవైసీ చేసుకోకుంటే బియ్యం రావని తెలియడంతో చాలా మంది రేషన్ షాపుల ముందు బారులు తీరుతున్నారు. అయితే కేవైసీ అనేది ప్రతి సంవత్సరం చేస్తారా లేక రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తారో స్పష్టత లేదు.
పైగా తెలంగాణ చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. వారు వచ్చి ఇప్పుడు కేవైసీ చేసుకోవాలంటే ఇబ్బందితో కూడుకున్న విషయం. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. పైగా తెలంగాణలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో రేషన్ కార్డుల్లో పేర్లు తొలగింపే చేపడితే ప్రజా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే కేవైసీ పూర్తయిన తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications