కరోనా ఎఫెక్ట్: పాతబస్తీలో షాపులు 15 రోజులు బంద్..?, స్వచ్చందంగా ముందుకొచ్చిన వ్యాపారులు..
హైదరాబాద్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజుకు 500 కన్నా ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. శుక్రవారం గ్రేటర్ పరిధిలోనే 774 పాజిటివ్ కేసులు రావడంతో ఆందోళన నెలకొంది. దీంతో పాతబస్తీలో కొందరు వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో షాపులను 15 రోజులపాటు మూసివేయాలని డిసిషన్ తీసుకున్నారు. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చని భావిస్తున్నారు. కాగా వారి నిర్ణయం వైరస్ స్ప్రెడ్ అవుతోన్న మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
పాతబస్తీ చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్ మర్చంట్ అసోసియేషన్ స్వచ్చందంగా 15 రోజులపాటు దుకాణాలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. చార్మినార్ చుట్టు ఉన్న ఇస్లామిక్ బుక్స్ షాపు యజమానులు కూడా షాపులను మూసివేశారు. పత్తర్ ఘట్టి ప్రాంతంలో కొందరు షాపు యజమానులు షాపులు తెరవడం లేదు. దీంతో చార్మినార్ ఏరియాలో జన సముదాయం భారీగా తగ్గింది. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రం బయటకు వస్తున్నారు. ఆదివారం నుంచి జులై 5తేదీ వరకు బేగంబజార్ మూసివేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు.

Recommended Video
కరోనా వైరస్‌తో శుక్రవారం 78 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4766కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 7436 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 4374 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 75,308 మందిని పరీక్షించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications