విద్యార్థినితో అసభ్య ప్రవర్తన: కీచక ల్యాబ్ అసిస్టెంట్‌ను చితక్కొట్టిన విద్యార్థులు

కరీంనగర్: ఓ ల్యాబ్ అసిస్టెంట్.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు సదరు ల్యాబ్ అసిస్టెంట్‍కు దేహశుద్ధి చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించినా వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఇన్విజిలేటర్‌గా వచ్చిన ల్యాబ్ అసిస్టెంట్ వెంకటేష్.. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు.

విషయం తెలిసిన తోటి విద్యార్థులు, యువతి బంధువులు ఆ కీచక ల్యాబ్ అసిస్టెంట్‌ను చితకబాదారు. పారిపాయేందుకు ప్రవర్తించిన వెంకటేష్‌ను పట్టుకుని మరీ దేహశుద్ధి చేశారు విద్యార్థులు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

Lab Assistant Thrashed For Misbehaving With Engg. Girl Student In Karimnagar

ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఆ కీచక ల్యాబ్ అసిస్టెంట్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఇలాంటి ల్యాబ్ అసిస్టెంట్ల వల్లే మొత్తమంది ఉపాధ్యాయులకు చెడ్డ పేరు వస్తోందని విద్యార్థులు మండిపడ్డారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కాగా, తాను ఓ విద్యార్థినిని ఫోన్ నెంబర్ అడిగినట్లు, ఐ లవ్యూ చెప్పినట్లు నిందితుడు వెంకటేష్ మీడియా ముందు అంగీకరించాడు. కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో తాను ఉంటున్నట్లు తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+