Mallareddy: ఆ విషయం కేసీఆర్ ముందే చెప్పారు.. అస్సలు విషయం బయటపెట్టిన మల్లారెడ్డి..
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లోనూ మూడో రోజు ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదన్నారు. కేంద్ర బలగాలతో మాపై పెద్దఎత్తున దాడులు చేశారని ఆరోపించారు.

కేసీఆర్ ను కూడా
మమ్మల్నేకాదు కేసీఆర్ ను కూడా ఏం చేయలేరు అన్నారు. మెడికల్ సీట్ల అడ్మిషన్ల్ లో అక్రమాలు జరిగాయని చెబుతున్నారని.. మెడికల్ సీట్లకు డొనేషన్లు తీసుకోలేదని మంత్రి చెప్పారు. ఐటీ దాడులు ఉంటాయని కేసీఆర్ ముందే చెప్పారని మల్లారెడ్డి తెలిపారు. కాగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి గురువారం హైదరాబాద్ చేరుకున్నారు.

ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే
ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే దాడులు జరుగుతున్నాయని అన్నారు. తాము చట్ట ప్రకారం ట్యాక్స్ కడుతున్నామని చెప్పారు. పార్టీ మారాలనే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. కాగా గత అర్ధరాత్రి సమయంలో మంత్రి మల్లారెడ్డి.. గన్ మెన్, సెక్యూరిటీ లేకుండా కేవలం డ్రైవర్ తో హాస్పిటల్ కి వెళ్లారు. తప్పుడు పత్రాలపై ఐటీశాఖ అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. మరోవైపు ఇదే విషయంపై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

రూ.10 కోట్ల 50 లక్షల
మల్లారెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత నివేదికలను ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డికి అందజేశారు. ఈనెల 28వ తేదీన (సోమవారం) ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసుల్లో స్పష్టం చేస్తుంది. మరోవైపు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీల్లో 10 కోట్ల 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications