ఉద్యోగం పోతే.. ఏడాదిపాటు నిరుద్యోగ భృతి: దత్తాత్రేయ
హైదరాబాద్: సెప్టెంబర్ 17న విశ్వకర్మ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని, ఆ రోజును జాతీయ కార్మిక దినోత్సవంగా పరిగణిస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.
ఈ సందర్భంగా కార్మికులకు అవార్డులను ప్రదానం చేస్తామని, కార్మిక పథకాలను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు
గురువారం హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్మికరాజ్య బీమా సంస్థలో సభ్యునిగా ఉండి, ఏదేని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ మూతపడినపుడు, సంస్థలో ఉద్యోగులను తగ్గించినపుడు, ప్రమాదం కారణంగా నిరుద్యోగిగా మారితే రాజీవ్ శ్రామిక్ కళ్యాణ యోజన కింద ఏడాదిపాటు సగం వేతనాన్ని నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ పథకం కింద ఉద్యోగి ఈఎస్‌ఐసీలో కనీసం రెండేళ్ల సభ్యుడిగా ఉండి, నిరుద్యోగిగా మారినపుడు ఏడాదిలోగా క్లెయిమ్ చేయాలని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులు, కార్మికులకు ప్రసూతి సెలవుల్ని 13 వారాల నుంచి 26 వారాలకు పెంచామని, తద్వారా 85 లక్షల మంది మహిళా కార్మికులకు లబ్ధిచేకూరనుందని వివరించారు.
త్వరలోనే ఖమ్మం, విజయవాడ, కర్నూలులో ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఈపీఎఫ్‌వో ట్రస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications