హైదరాబాదులో లేడీ టెక్కీ మృతి: భర్త హత్య చేశాడని అనుమానం
హైదరాబాద్: హైదరాబాదులో గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడినట్లుల ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మల్లీశ్వరి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని భర్త వేధిస్తుండటంతో చందానగర్ లోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
భర్త సునందకుమార్ మోహిత్ ఓ ప్రైవెట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మృతురాలు గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఉండవల్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. భర్త నందకుమార్ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. వారికి ఓ బాబు ఉన్నాడు.

కొద్దికాలంగా భర్త సునంద కుమార్ మల్లీశ్వరిని వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చాలా సార్లు కుటుంబ పెద్దలకు ఫిర్యాదుచేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురై మల్లీశ్వరి శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్లాట్ గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.

సమాచారం అందుకున్న మల్లీశ్వరి బంధువులు ఫ్లాట్‌కు వెళ్లి పరిశీలించారు. ఆమె మెడపై, ముఖంపై గాయాలు కనిపించాయి. దీంతో భర్త హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications