ప్రేమ గొడవలు: మనస్తాపంతో ఉరేసుకుని లేడీ టెక్కీ మృతి

హైదరాబాద్: ప్రేమ వ్యవహారంలో మనస్ప ర్థల కారణంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాదులోని మల్కాజిగిరి మౌలాలి తిర్మల్‌ నగర్‌కు చెందిన రీనా సిల్వియా రిచర్డ్‌సన్‌(23) డిలైట్‌ కంపనీలో(హెచ్‌ఆర్‌) పనిచేస్తున్నారు. ఈమెకు కళాశాల నుంచి స్నేహితుడైన మేడిపల్లికి చెందిన డెన్జిల్‌తో పరిచయం ఉండడంతో ప్రేమగా మారింది.

ఐదేళ్ల నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. డెన్జిల్‌ రీనా పనిచేసే సంస్థలోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి డెన్జిల్‌ కుటుంబ సభ్యులు, రీనా మధ్య గొడవ జరిగినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అదే రోజు రాత్రి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఘర్షణ అనంతరం రీనా ఇంటికి వచ్చేసింది.

Lady techie commits suicide in Hyderabad

మనస్తాపం చెందిన ఆమె సోమవారం ఉదయం చున్నీతో ఉరేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోగల జీనియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. రీనా తల్లి మేరీజాన్‌ ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో రీచా వివాహం విషయమై డెంజీల్‌తో మాట్లాడగా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆదివారం అతడి ఇంటికి వెళ్లిన రిచాను డెంజీల్ తల్లిదండ్రులు సునీత, బిషప్‌రావు దూషించారు. దీంతో రీచా మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆమె తల్లి మెరీజాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+