ప్రియుడితో మెసేజ్‌ల సంభాషణ: హైదరాబాద్‌లో లేడీ టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ వ్యవహారంలో విభేదాల వల్ల ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు హైదరాబాదులో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను జార్ఖండ్‌కు చెందిన ప్రీతి (26)గా గుర్తించారు. ఆమె హైదరాబాద్‌లోని ఓ బహుళ జాతి సంస్థలో పనిచేస్తోంది.
నాలుగు నెలల క్రితమే ఆమె ఇక్కడ ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం నానక్‌రాంగూడలోని సెరెనిటీ అపార్టుమెంటులో ఉంటోంది. ఆమె స్నేహితుడితో ప్రేమ వ్యవహారంలో ఆమె విఫలమైనట్లు తెలుస్తోంది. దాంతోనే ఆమె మనస్తాపానికి గురై మరణించినట్లు భావిస్తున్నారు.

ప్రేమ వ్యవహారం విషయంలో ప్రీతి, అతను గురువారం అర్థరాత్రి వరకు ఫోన్‌లో మెసేజ్‌లు పంపించుకున్నారు. తెల్లవారు జామను తన అపార్టుమెంటులో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రీతి మరణించింది. శుక్రవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి స్థానికంగా అయ్యప్ప సొసైటీ కాలనీలో ఉంటున్న ఆమె సోదరుడికి సమాచరాం అందించారు.
అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications