కాళేశ్వరం జలాలకు లక్ష జనహారతి: వండర్ వరల్డ్ బుక్‌లో చోటు
నల్గొండ: తెలంగాణ దశాబ్ది వేడుకలను సూర్యపేట జిల్లాలో ఘనంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా సూర్యపేట జిల్లా అధికార యంత్రాంగం చెరువుల పండగను ఘనంగా నిర్వహించారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి కాళేశ్వరం జలాలను మొదటగా జిల్లాకు అందించినందుకు గానూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక, ఎస్సారెస్పీ కాలువపై లక్ష జనహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా లక్ష మందితో కాళేశ్వరం జలాలకు హారతి కార్యక్రమం.#దశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10 pic.twitter.com/y7vLpGQtGl
— Jagadish Reddy G (@jagadishBRS) June 7, 2023
ఈ ప్రాంతంలో 68 కిలోమీటర్ల పొడవులో 2.45 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్న ఎస్సారెస్పీ కాలువలోని కాళేశ్వరం జలాలకు ప్రజలు హారతినిచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు కన్నుల పండవగా జరుపుకున్నారు. కాగా, ఈ కార్యక్రమం వండర్ వరల్డ్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఈ మేరకు వండర్ వరల్డ్ బుక్ ప్రతినిధులు మంత్రి జగదీశ్ రెడ్డికి సన్మానించారు.

ఈ సందర్భంగా చివ్వెంల ప్రాంతంలో లక్ష జనహారతి కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి రైతులతో కలిసి గోదావరి జలాలకు చీర, సారె, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. ఎడారిగా ఉన్న సూర్యాపేట ప్రాంతానికి మొదటగా కాళేశ్వరం జలాలు అందించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా లక్ష జనహారతి ఇచ్చినట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో 126 గ్రామాల పరిధిలోని ప్రజలు కాళేశ్వరం జలాలు పారుతున్న కాల్వల కట్టలపై చేరుకుని.. హారతి ఇచ్చి, పూలు జల్లి సీఎం కేసీఆర్‌కు ధన్వవాదాలు తెలిపారు. ఇందుకు అధికార యంత్రాంగం కాలువ పొడవునా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలో కాళేశ్వరం జలాలకు హారతి కార్యక్రమం.#దశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10 pic.twitter.com/JuxWxWHhRC
— Jagadish Reddy G (@jagadishBRS) June 7, 2023
సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలం ఈటూరు నుంచి పెన్ పహాడ్ మండలం రావిచెరువు వరకు మొత్తం 68 కిలోమీటర్ల మేరకు ఎస్సారెస్పీ కాలువ వెంట స్థానిక ప్రజలు.. చివ్వెంల మండల కేంద్రంలో జగదీశ్‌రెడ్డి జల హారతిని ఇచ్చారు. నీటి కరవుతో మొదట బోరు బావులను ఉపయోగించిన సూర్యాపేట ప్రాంతంలో.. నేడు కాళేశ్వరం జలాలతో సాగునీటికి ఎటువంటి కొరత లేకుండా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. 50 ఏళ తర్వాత అన్నదాతల కల ఇన్నాళ్లకు సాకారం అయిందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.












Click it and Unblock the Notifications