విమానాశ్రయాల దగ్గర భూములు, ఇళ్ళ ధరలకు రెక్కలు.. కొంటే సుడి తిరిగినట్టే!
ఒకప్పుడు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో భూములు, ఇళ్ళు కొనుగోలు చేయాలంటే పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ఎయిర్పోర్టుకు దగ్గరగా అంత చెప్పుకోదగిన డెవలప్మెంట్ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చాలామంది అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఆస్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రాంతాలలో ప్లాట్లు, అపార్ట్మెంట్లను కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న క్రమంలో వీటి ధరలు అమాంతంగా పెరుగుతున్నాయని స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెల్లడించింది.
భూముల ధరలపై స్క్వేర్ యార్డ్స్ నివేదిక
ముఖ్యంగా అపార్ట్మెంట్ల కంటే ప్లాట్లు వేగంగా విలువను పెంచుకుంటున్నాయి అని ఈ నివేదిక స్పష్టం చేసింది. గత నాలుగు సంవత్సరాలలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన విమానాశ్రయాలు ఉన్న నగరాలలో, విమానాశ్రయాల సమీపంలో ప్లాట్ల విలువలు 84 శాతం నుంచి 118 శాతానికి పెరిగాయని, అదే సమయంలో అపార్ట్మెంట్ల ధరలు 45 శాతం నుంచి 93 శాతానికి పెరిగాయని స్క్వేర్ యార్డ్స్ తన నివేదికలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

సౌత్ హైదరాబాద్ లో పెరిగిన ధరలు
ఈ గణాంకాలు విమానాశ్రయాలకు దగ్గరగా ఉన్న రియల్ ఎస్టేట్లో ప్లాట్లలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నట్టుగా సూచిస్తున్నాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానానికి సౌత్ హైదరాబాద్ కారిడార్లో ప్లాట్లు ధరలు చదరపు అడుగుకు సగటున 55 వేల రూపాయల నుండి 60 వేల మధ్య కొనసాగుతున్నాయి. ఇవి గత నాలుగేళ్లలో 84 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
సౌత్ హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ లలో ధరలిలా
ఇక సౌత్ హైదరాబాద్లో ఫ్లాట్లు ధరలు చదరపు అడుగుకు ఆరువేల రూపాయల నుండి ఎనిమిది వేల రూపాయలు ఉండగా 74 శాతం వృద్ధిని నమోదు చేశాయి. హైదరాబాదులోని ఇతర ప్రాంతాలలో ప్లాట్ల ధరలు చదరపు అడుగుకు 75 వేల రూపాయల నుంచి 80000 ఉండగా, ప్లాట్ల ధరల వృద్ధి 59 శాతంగా ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాలలో అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకు 9వేల నుండి 11వేల వద్ద ఉన్నాయి.
విమానాశ్రయాల సమీపంలో పెరుగుతున్న ధరలు.. కారణమిదే
హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరల వృద్ధి 48 శాతంగా ఉంది. అయితే ఇతర ప్రాంతాలలో వృద్ధితో పోలిస్తే ఎయిర్పోర్ట్ సమీపంలో వృద్ధి చాలా గణనీయంగా కనిపిస్తుంది. దీనికి కారణం మెరుగైన కనెక్టివిటీ, విమానాశ్రయ పరిసరాలలో విస్తరిస్తున్న ఉగాది ఉపాధి అవకాశాలు, ఆ ప్రాంతాలలో ఉంటున్న మౌలిక వసతులు ఈ వృద్ధికి కారణమని స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెల్లడించింది.
దేశంలో ప్రధాన విమానాశ్రయాల దగ్గర వృద్ధి సాధిస్తున్న ప్రాంతాలివే
విమానాశ్రయాలు కేవలం రవాణా కేంద్రాలు గానే కాకుండా, స్థిరాస్తి వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తున్నట్టు తాజా నివేదికతో అర్థమవుతుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని సౌత్ హైదరాబాద్, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నార్త్ బెంగుళూరు, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలోని యమునా ఎక్స్ప్రెస్ వే, నవి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పన్వేల్ ప్రాంతం విమానాశ్రయ ఆధారిత వృద్ధిని సూచిస్తున్నాయి.
ఈ ప్రాంతాలలో పెట్టుబడులు పెడితే లాభాలు
ఈ ప్రాంతాలలో ఇళ్ళు, అపార్ట్మెంట్స్, ప్లాట్లు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలిక లాభాలు వచ్చే అవకాశం ఉందని స్క్వేర్ యార్డ్స్ నివేదిక పేర్కొంది.












Click it and Unblock the Notifications