భూ వివాదంలో రెచ్చిపోయిన ప్రత్యర్థులు: గొడ్డళ్లు, కత్తులతో దాడి; ముగ్గురు మృతి
కుమురంభీం అసిఫాబాద్: జిల్లాలోని రెబ్బన మండలం జక్కుపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యర్థులు గొడ్డళ్లు, కత్తులతో దాడికి దిగడంతో.. మహిళ సహా ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి ఓకే ఇంటి పేరుతో గల కుటుంబాల మధ్య భూతగాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రెబ్బెన మండల పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అప్పటి నుంచి కేసు కొనసాగుతూనే ఉంది.

గ్రామంలో కుల పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. అయినా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఈ గొడవ కొనసాగుతూ వస్తోంది. అయితే, తాజాగా వర్షాలు కురుస్తుండటంతో మూడు, నాలుగు రోజుల క్రితం 12 ఎకరాల భూమిలో నరసయ్య, బక్కమ్మ, లింగయ్య అనే వ్యక్తులు పత్తి విత్తనాలు నాటారు. ఇదే క్రమంలో మరో వర్గం వారు అదే పొలంలో పెసర పంట వేయడానికి ఇవాళ వెళ్లారు. ఈ విషయంలో ఇరువురి మధ్య పెద్ద గొడవ జరిగింది.
మాటమాట పెరిగి భౌతిక దాడులకు దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వారు ఒకరిపై ఒకరు గొడ్డళ్లు, కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు. సుమారు 18 మంది గొడవలో ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఈ ఘర్షణలో ముగ్గురు మృతి చెందగా.. మరికొంత మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేరొన్నారు. గాయపడిన వారిని బెల్లంపల్లిలోని సింగరేణి ప్రభుత్వ ఆసుపత్రికి, మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ గొడవలో వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి దాడులకు పాల్పడినట్లు ఒక వర్గం వారు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గొడవలో ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి దాడి చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ మూడు హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి.
ఆటో తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా: 40 మందికి గాయాలు
హైదరాబాద్లో జరిగిన బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా.. డివైడర్ను ఢీకొట్టి బస్సు బోల్తాపడిన ఘటన సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ముస్లిం కుటుంబం బంధువులతో కలిసి హైదరాబాద్కు పెళ్లికి వెళ్లి.. సోమవారం రామగుండంకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కాట్నపల్లి గ్రామం వద్ద అకస్మాత్తుగా ఆటో ఎదురురావడంతో.. డ్రైవర్ దానిని తప్పించవడంతో బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఒక మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ మహేష్ తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications