రూ.4 వేలకే ల్యాప్‌టాప్.. జనం ఎగబడడంతో గందరగోళం !!
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరుగుతోంది. విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, వర్క్ ఫ్రం హోమ్ ప్రొఫెషనల్స్ వంటి వర్గాలకు ల్యాప్‌టాప్‌ల అవసరం గట్టిగా ఉంటుంది. సాధారణంగా దీని ధర రూ.20 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక బ్రాండ్‌ను బట్టి ధర మారుతుంది. అయితే ఆర్ధికంగా అంత వెచ్చించలేని వారు సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తూ ఉంటారు.
రూ.4 వేలకే ల్యాప్‌టాప్..
అయితే ఇప్పుడు ప్రముఖ సంస్థలు సైతం ఫెస్టివల్ సీజన్ అంటూ ఒక్కోసారి ఒక్కో ఆఫర్ ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్లోని ఓ ఎలక్ట్రానిక్ షాపు యాజమాన్యం రూ.4 వేలకే ల్యాప్‌టాప్ అంటూ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం చేసింది. ఈ విషయం కాస్త వైరల్ కావడంతో.. ఉదయం నుంచే షాపు ముందు జనం క్యూ కట్టారు. దీంతో రద్దీ ఎక్కువ అయ్యి కస్టమర్లు క్యూ కట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షాపును మూసివేయించారు. ప్రచారం కోసం ఇలా జనాల ప్రాణాలతో చెలగాటం ఆదుకోవద్దంటూ షాపు యజమానులను పోలీసులు హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. అలానే ప్రజలు సోషల్ మీడియలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఈ తరహా వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిదని స్పష్టం చేశారు. మొత్తంగా ఈ తరహా చవక ఆఫర్లను గుడ్డిగా నమ్మి వెళితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications