కరుడుగట్టిన నేరస్తుడు, డాన్ సంపత్ నెహ్రా అరెస్ట్
హైదరాబాద్: దేశంలో పలు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతూ కంటిమీద కునుకు లేకుండా చేసిన మాఫియా డాన్ సంపత్ నెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో గత కొంత కాలంగా పోలీసుల కన్నుగప్పి తలదాచుకుంటున్నాడు.
కాగా, పక్క సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటీ, హర్యానా స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా జరిపిన దాడుల్లో పట్టుబడ్డాడు. సంపత్ హర్యానాలో మాఫియా డాన్‌గా ఎదిగాడు. లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడ్డాడు. అయితే ఎప్పుడు ఎవరికీ కనిపించకుండా తన సామ్రాజ్యాన్ని పక్క రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరించాడు.

పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు దాడులు జరపడంతో ఇరువై రోజుల క్రితం భాగ్యనగరానికి పారిపోయి వచ్చాడు. ఎవరికీ తెలియకుండా మియాపూర్‌లో తన కార్యకలాపాలు జరుపుతున్నాడు. ఈనేపథ్యంలో సంపత్ గురించి పక్కా సమాచారం అందుకున్న హర్యానా పోలీసులు, హైదరాబాద్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి తుపాకులను స్వాథీనం చేసుకున్నారు. మూడు రాష్ట్రాల్లో దాదాపు పది హత్య కేసులు, మూడు హత్యాచార కేసులు, పదుల సంఖ్యలో దోపిడీలు, బెదిరింపుల కేసులు నమోదైనట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు. కాగా, లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ సభ్యుడిగా కూడా సంపత్ కొనసాగుతున్నాడు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!