మీరు ఏం చేయలేదు, మా కాలనీకి రాకండి: టీఆర్ఎస్ ప్రచార రథం అడ్డగింత
హైదరాబాద్: ఎల్బీ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్‌కు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఆయన ప్రచారరథాన్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ కాలనీకి రావొద్దని అడ్డుకున్నారు. ఫ్లెక్సీని చించివేశారు.
బాలాపూర్ మండలం శివాజీ చౌక్ డీఆర్డీఎల్ రోషన్ దౌలాలో ఈ సంఘటన జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు ఎలాంటి పథకాలు అందలేదని, అలాగే ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏం చేయలేదన్నారు.

ఖమ్మం జిల్లాలో వినూత్న నిరసన
ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం ముజాహిపురం, సుద్దవాగు తండాల ప్రజలు వినూత్న నిరసన తెలిపారు. తమ రెండు గ్రామాల్లో తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించలేదని, రోడ్లు, బస్సు సౌకర్యం కల్పించలేదని మండిపడిన గ్రామస్తులు.. ఓట్లు అడిగేందుకు తమ గ్రామంలోకి ఏ పార్టీ నేతలు రావొద్దని ఫ్లెక్సీ కట్టారు. నిరసన తెలిపి నినాదాలు చేశారు. తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications