రోహిత్ ఆత్మహత్య: వీడియో.. ఏబీవీపీ నేతలతో వాగ్వాదం ఇదే...

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోహిత్ ఏఎస్ఏ సంస్థలో ఉన్నారు. ఇతనికి, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన వాగ్వాదం వీడియో మూడు రోజుల విడుదలైంది. ఇది ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

ఈ వీడియో బయటకు రావడాన్ని ఏఎస్ఏ విద్యార్థులు తప్పుబట్టారు. కావాలనే ఏబీవీపీ వాళ్లు ఈ వీడియోను బయటకు విడుదల చేశారని ఆరోపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వీడియోలో ఏముందనేది ఆసక్తికరంగా మారింది. వస్తున్న వార్తల మేరకు ఆ వీడియోలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఇదీ...

Leaked Video: Rohith Vemula Before Committing Suicide!

రోహిత్: హిందుత్వ గానీ, ఏబీవీపీ గానీ కనబడితే ఎదిరించమని నా సంస్థ నేర్పింది. ఇంకా ఏం నేర్పిందంటే.. హిందుత్వగానీ, హిందువులు గానీ హిందు పేరు చెప్పి మైనార్టీల పైకి వచ్చేవాళ్లు గానీ, దళితుల గురించి మాట్లాడేవాళ్లు గానీ కనబడితే ఎదిరించమంది.

ఏబీవీపీ విద్యార్థులు: అదంతా కాదు నువ్వు మా బ్యానర్ ఎందుకు చింపావు.. అదే అడుగుతున్నాం.

రోహిత్: అవును నేనే చింపాను. ఏబీవీపీ బ్యానర్ కనబడింది చింపేశాను.

ఏబీవీపీ విద్యార్థులు: ఎందుకు చింపావు కారణం చెప్పు

రోహిత్: కాషాయ రంగు కనబడింది. హిందూ కలర్ కనబడింది. కోపమొచ్చి చించేశాను.

ఏబీవీపీ విద్యార్థులు: రేపు మీ ఇంట్లో కాషాయ రంగు చీరలు ఉంటే చించుతావా

రోహిత్: చించుతాను.

ఏబీవీపీ విద్యార్థులు: నీకు నచ్చలేదని మావి చించావు. మేం కూడా మీవి చించొచ్చా. మేం అలా చించితే మీ బ్యానర్ ఒక్కటీ ఉండదు.

రోహిత్: చించుకోండి. చూసుకుందాం.

ఏబీవీపీ విద్యార్థులు: మాకు చించవలసిన అవసరం లేదు. మేం పద్ధతిగా బ్యానర్లు కట్టుకున్నాం. సిగ్గుండాలి మనిషికి. ఏం చదువుతున్నావు.. పిహెచ్‌డినా.. మనిషికి కామన్ సెన్స్ లేదు. సర్లే చూసుకుందాం అన్నావుగా.. చూసుకుందాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+