మేడారం జాతర హుండీలలో షాకింగ్ లేఖలు..లేఖల్లో ఏముందంటే!

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర నాలుగు రోజులపాటు కోట్లాదిమంది భక్తజనంతో నిర్వహించబడింది. ప్రస్తుతం మేడారం జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. తెలంగాణ కుంభమేళా అయిన మేడారం మహా జాతరలో జాతర హుండీల లెక్కింపును హన్మకొండలోని టిటిడి కళ్యాణమండపంలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.

మేడారం హుండీల లెక్కింపు సాగుతుంది ఇలా

లెక్కింపు ప్రక్రియ స్పెషల్ ఆఫీసర్ ఈ కృష్ణ ప్రసాద్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, మేడారం ఈవో వీరస్వామిలు దగ్గరుండి మరీ ఈ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. మేడారం జాతరకు సంబంధించి మొత్తం 828 హుండీలకు గాను, 125 హుండీలను తెరిచి నిన్న లెక్కించారు. ఈ 125 హుండీల ద్వారా రెండు కోట్ల 49 లక్షల 65 వేల రూపాయల ఆదాయం తొలి రోజు దేవాదాయ శాఖకు సమకూరింది.

letters in medaram jathara hundis shocking appeals over love properties and also personal issues

జాతర హుండీలలో లభిస్తుంది ఇవే

దాదాపు పది రోజులపాటు మొత్తం ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఇందులో అమ్మవారి హుండీలో డబ్బులతో పాటు బంగారం, వెండి వంటి ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. విదేశీ కరెన్సీ, గతంలో మార్చుకోలేకపోయిన పాత కరెన్సీ ఇలా ప్రతీది మేడారం జాతర హుండీలలో దర్శనమిస్తున్నాయి. హుండీల లెక్కింపు కోసం దేవాదాయ శాఖ ఉద్యోగులు 200 మందితో పాటు సేవా సమితి నుంచి 300 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.

జాతర హుండీలలో ఆసక్తికర లేఖలు

ఈ మేడారం జాతరకు వచ్చిన మొత్తం ఆదాయంలో 33 శాతం ఆదాయాన్ని పూజారులకు ఇస్తారు. గత జాతరలో 13 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుతం అంతకు మించిన ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జాతర హుండీలలో అమ్మవారి వద్ద మొక్కులు చెల్లించుకున్న భక్తులు డబ్బులతో పాటు కొన్ని లేఖలు కూడా వేయడం, లెక్కించే సిబ్బందిని షాక్ కు గురిచేస్తుంది.

జాతర హుండీలలో వేసిన లేఖలలో విన్నపాలు ఇవే

జాతర హుండీల లెక్కింపు లో కొన్ని ప్రేమలేఖలు రావడం, తమ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటూ లేఖలను హుండీలో వేయడం కనిపించింది. అంతేకాదు మేడారం సమ్మక్క సారలమ్మలకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలను కూడా హుండీలలో వేశారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవ్వాలని, భార్యాభర్తల పంచాయతీలు లేకుండా ఉండాలని ఇలా రకరకాల విజ్ఞప్తులు అమ్మవారిని ఉద్దేశించి రాసి మేడారం హుండీలలో వేశారు.

లేఖలపై ఆసక్తికర చర్చ

ప్రస్తుతం హుండీలను లెక్కిస్తున్న సిబ్బందికి ఈ లేఖలు దర్శనమివ్వడం ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. మొత్తం పది రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో ఇంకా ముందు ముందు ఎటువంటి లేఖలు చూడవలసి వస్తుందోనని హుండీలను లెక్కిస్తున్న సిబ్బంది చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+