కామాంధుడి ఘాతుకం: తల్లితో సహజీవనం, కూతురిపై రేప్

హైదరాబాద్: ఓ కామాంధుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతురిపై అత్యాచారం చేసిన అతను పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన హైదరాబాదులోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

నల్లగొండ జిల్లా దేవరకొండకు మండలం తాటికోల్ గ్రామానికి చెందిన మందపల్లి సుజాతకు, గుంటారు జిల్లా బాపట్లకు చెందిన శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు (13) ఉన్నారు. అనారోగ్యంతో ఐదేళ్ల కిందట శ్రీనివాస్ మరణించాడు. ఉపాధి నిమిత్తం పిల్లలతో సుజాత హైదరాబాద్ నగరానికి వచ్చి చంపాపేట సమీపంలోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటోంది.

Live in partnership with mother: daughter raped

గత కొద్ది రోజులుగా ఎర్రగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ అంజాద్ (32)తో సుజాత సహజీవనం చేస్తోంది. సుజాత కూతురు తన సమీప బంధువు వద్ద పరిగిలో ఉంటూ చదువుకుంటోంది. అయితే, సుజాత అనారోగ్యానికి గురి కావడంతో రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటోంది.

ఇది అంజాద్‌కు నచ్చలేదు. దాంతో అతను సజాతను కొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో బుధవారంనాడు ఉదయం సుజాత బయటకు వెళ్లగా ఆమె కూతురిపై అంజాద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన సుజాత సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తు్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+