విషాదం : పెళ్లికి పెద్దలు ఒప్పుకోవట్లేదని... హోటలో గదిలో ప్రేమ జంట బలవన్మరణం..

ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో యువతీ,యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం... జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోల్కొండ గ్రామానికి చెందిన అజయ్‌ ఉప్పల్‌లోని బజాజ్‌ వెహికల్‌ షోరూంలో సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఫిర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌‌కి చెందిన శ్రావణి(23) బోడుప్పల్‌లోని బజాజ్ షోరూంలో పనిచేస్తున్నాడు.

love couple committed suicide after parents refused in hyderabad

ఈ క్రమంలో రెండేళ్ల క్రితం వీరికి పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకోవాలనుకున్న ఉద్దేశంతో ఇటీవలే ఇరువురి పెద్దలకు ప్రేమ విషయాన్ని చెప్పారు. అయితే శ్రావణి కుటుంబం అందుకు ఒప్పుకున్నా... అజయ్ కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో కొన్నాళ్లుగా అజయ్ తన తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయినప్పటికీ వాళ్ల అభిప్రాయం మారే సూచనలు కనిపించకపోవడంతో ఇద్దరూ తీవ్ర మనస్తాపం చెందారు.

మంగళవారం(జూలై 14) అజయ్,శ్రావణి ఇద్దరూ కలిసి మేడిపల్లిలోని ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఆరోజు రాత్రి ఆ గదిలో ఉన్న బాత్‌రూమ్‌లో నీళ్లు వృథాగా పోతున్నట్లు సిబ్బంది గమనించారు. గది వద్దకు వచ్చి తలుపు తట్టగా కాసేపటివరకూ ఎటువంటి స్పందన లేదు. కొద్దిసేపటికి అజయ్ గది తలుపు తీశాడు. అయితే అప్పటికే అతను పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితికి చేరుకుని కుప్పకూలాడు.

అప్పటికే శ్రావణి పురుగుల మందు తాగి విగతజీవిగా బెడ్‌పై పడి ఉన్నది. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చి.. అజయ్‌ను చికిత్స నిమిత్తం ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందాడు. దీంతో శ్రావణి,అజయ్‌ల ప్రేమ కథ విషాదాంతమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+