చేయి దాటిపోతోందని ప్రేయసిని చంపేశాడు
మహబూబ్‌నగర్: తనను నిర్లక్ష్యం చేస్తోందనే కోపంతో ప్రియుడే ప్రియురాలిని హత్య చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండలం పోలిశెట్టిపల్లి వద్ద మార్చి 24న గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిని హత్య చేసి ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఎస్పీ విశ్వప్రసాద్ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లా రాంచంద్రాపురానికి చెందిన రాధిక (22) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. బీహెచ్‌ఈఎల్ మైదానంలో ఆమె మార్నింగ్‌వాక్ చేస్తుండగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన పసుల విజయ్‌కుమార్‌గౌడ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
మూడేళ్ల పాటు వారి ప్రేమ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం రాధిక ముంబై, గోవా, బెంగళూరు పర్యటనకు వెళ్లింది. అక్కడి నుంచి వచ్చాక పాస్‌పోర్ట్ తీసుకొని ఇంట్లో వాళ్లకు, విజయ్‌కుమార్‌కు సమాచారం ఇవ్వకుండా మరో ఇద్దరు యువతులతో కలిసి శ్రీలంక వెళ్లింది. అక్కడ కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. అక్కడ జరిగే బెట్టింగ్‌లలో రాధిక కాయిన్స్ ఇవ్వడం, పబ్బులలో నృత్యాలు చేయడం తదితర పనులు చేసేది. నెల తర్వాత తిరిగి వచ్చిన రాధికతో విజయ్ పెళ్లి ప్రస్తావన చేశాడు. కానీ ఆమె అంగీకరించలేదు. ఎవరైనా యువతులు ఉంటే పరిచయం చేయాలని పలుమార్లు విజయ్‌ను కోరింది.

తాను ప్రేమించిన రాధిక చేయి దాటిపోతుందని అనుమానించిన విజయ్ తన స్నేహితుడు కిషోర్‌కు విషయం చెప్పాడు. అప్పుడే ఆమెను పథకం పన్నాడు.ఈ నేపథ్యంలో మళ్ళీ శ్రీలంకకు వెళ్తున్నట్లు రాధిక చెప్పింది. బెంగుళూర్ వరకు తాము కూడా వస్తామని చెప్పి మార్చి 23న రాత్రి విజయ్, కిషోర్‌లు రాధికను కారులో ఎక్కించుకుని బయలు దేరారు. శ్రీశైలంలో దర్శనం చేసుకుని కర్నూల్ మీదుగా బెంగుళూరు వెళ్దామని నమ్మించారు. 24న తెల్లవారుజామున బల్మూరు మండలం హాజిపూర్ చౌరస్తా వద్ద కారును ఆపారు. వెనుక కూర్చున్న విజయ్ ముందు సీటులో కూర్చున్న రాధిక గొంతును కత్తితో కోసి చంపేశాడు.
రాధిక మృతదేహాన్ని పొలిశెట్టి పల్లి వద్ద కింద పడేసి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసి తగులబెట్టారు. అక్కడి నుంచి గుల్బర్గ మీదుగా హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. కాలిపోతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో 30వ తేదీన రాధిక అదృశ్యమైందంటూ రాంచంద్రాపురం పీఎ్‌సకు ఫిర్యాదు అందడంతో అచ్చంపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలికలు కొంత సరిపోలడంతో రాధిక తల్లిదండ్రులను పిలిపించి వివరాలు సేకరించారు. వెంట్రుకలు, పండ్ల వరుస, కాలివేళ్ళ వరుసను తల్లి గుర్తుపట్టింది. డీఎన్‌ఏ పరీక్షలు కూడా నిర్వహించి నిర్ధారించారు.
తమ కుమార్తెతో విజయ్‌కుమార్‌గౌడ్ చనువుగా ఉండేవాడని తల్లిదండ్రులు చెప్పడంతో, అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. హత్య చేసినట్లు విజయ్ ఒప్పుకోవడంతో అతడితో పాటు స్నేహితుడు కిషోర్ , విజయ్ సోదరుడు వినయ్‌కుమార్‌గౌడ్‌లను కూడా అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications