ఖైరతాబాద్ డెత్ మిస్టరీ: వారిది ఆత్మహాత్యే, పెళ్లి విషయమై గొడవ పడి సూసైడ్

హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో స్నేహితులిద్దరూ అనుమానాస్పదస్థితిలో మరణించిన ఘటనను ఆత్మహత్యగానే పోలీసులు ప్రాథమిక విచారణ ఆధారంగా ధృవీకరిస్తున్నారు. వీరిద్దరి మృతికి ఖచ్చితమైన సమాచారం కోసం ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

పోలీసుల కథనం మేరకు శుక్రవారం నాడు మధ్యాహ్నాం రెండున్నర గంటలకు మహేశ్వర్ రెడ్డి వాహానంపై వర్షశ్రీ ఇంటికి వచ్చాడు. తనతో పాటు మిఠాయి డబ్బాను తెచ్చాడు.ఆ సమయంలో వర్షశ్రీతో పాటు ఆమె నాయనమ్మ కూడ ఆ ఇంట్లోనే ఉంది. తొలుత వీరిద్దరూ కూడ తమ పెళ్ళి గురించి చర్చించారంటున్నారు. అయితే కుటుంబసభ్యుల సమ్మతి మేరకే తాను పెళ్ళి చేసుకొంటానని వర్షశ్రీ తెగేసీ చెప్పడంతో ఇద్దరూ గొడవకు దిగారని పోలీసులు చెప్పారు.

Lovers end lives in Khairatabad flat

కుటుంబసభ్యుల అనుమతిస్తేనే పెళ్ళికి సిద్దమని వర్షశ్రీ చెప్పడంతో మనస్తాపానికి గురైన మహేశ్వర్ రెడ్డి చీరెతో బెడ్‌రూమ్‌లో ఉరేసుకొన్నాడు. దీంతో వర్షశ్రీ తన సోదరుడికి ఫోన్ చేసి ఏడ్చి కట్ చేసింది. ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు.

వర్షశ్రీ సోదరుడు ఇంటికి వచ్చేసరికి వర్షశ్రీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొందని పోలీసులు చెప్పారు. ప్రాథమిక విచారణ ఆధారంగా వీరిద్దరూ ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు చెబుతున్నారు.

వీరి మరణానికి ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ మేరకు ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

రెండు మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మృతుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కాల్‌డేటాను పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+