హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lunar eclipse2022: నేడే చంద్రగ్రహణం.. సమయం,సూతకకాలం ఇదే; గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటించండి!!

|
Google Oneindia TeluguNews

నేడు చంద్రగ్రహణం. 2022 చివరి చంద్ర గ్రహణం ఈరోజు నవంబర్ 8 వ తేదీన మంగళవారం నాడు అంటే నేడు సంభవించనుంది. చంద్ర గ్రహణం అనేక భారతీయ నగరాలు మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. తద్వారా సూర్యకాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. ఇక ఆ సమయంలో ఈ చంద్ర గ్రహణం సంపూర్ణ చంద్ర గ్రహణం అవుతుంది.

Lunar eclipse2022: రేపే చంద్రగ్రహణం.. ఈ 5రాశుల వారికి ప్రతికూల ప్రభావం; తస్మాత్ జాగ్రత్త!!Lunar eclipse2022: రేపే చంద్రగ్రహణం.. ఈ 5రాశుల వారికి ప్రతికూల ప్రభావం; తస్మాత్ జాగ్రత్త!!

 చంద్రగ్రహణం సమయం .. సూతక కాలం ఇదే

చంద్రగ్రహణం సమయం .. సూతక కాలం ఇదే


చంద్ర గ్రహణం నవంబర్ 8, మంగళవారం, సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. మొత్తం చంద్రగ్రహణం దశ వ్యవధి 01 గంట 24 నిమిషాలు 28 సెకన్లు పాటు ఏర్పడుతుంది. పాక్షిక దశ వ్యవధి 03 గంటలు 38 నిమిషాలు 35 సెకన్ల పాటు ఉంటుంది. భారతదేశంలో చంద్రగ్రహణం సూతక కాలం గృహణానికి 9 గంటల ముందు ప్రారంభం అవుతుంది. దృక్ పంచాంగం ప్రకారం అంటే చంద్రగ్రహణం ప్రారంభానికి ముందు నేడు ఉదయం 9 గంటల 21 నిమిషాలకు ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం సూతకం నవంబరు 8 సాయంత్రం 06:18 తర్వాత ముగుస్తుంది.

పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారికి సూతక కాలం ఇదే

పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారికి సూతక కాలం ఇదే


గ్రహణానికి ముందు కాలాన్ని సూతక కాలం అంటారు. సహజంగా సూతక కాలాన్ని అశుభ కాలంగా పరిగణిస్తారు . పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సూతక సమయం మధ్యాహ్నం 2:48 గంటలకు ప్రారంభమవుతుంది. పిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల సూతక సమయం సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది.

దేశంలోనూ, ప్రపంచంలోని వివిధ నగరాలలో చంద్రగ్రహణం ఇలా

దేశంలోనూ, ప్రపంచంలోని వివిధ నగరాలలో చంద్రగ్రహణం ఇలా


భారతదేశంలో చంద్రగ్రహణం ఢిల్లీ, లక్నో, హైదరాబాద్, కలకత్తా, పాట్నా లలో కనిపిస్తుంది. పాట్నా, రాంచీ, కోల్‌కతా, గౌహతి, సిలిగురి ఇతర తూర్పు నగరాల నుండి సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఢిల్లీ మరియు ఇతర ఉత్తర నగరాల్లో పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడగలరు. ఉత్తర మరియు దేశంలోని ఇతర ప్రాంతాలలో నివసించే ప్రజలు పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడగలరు. ఖాట్మండు, టోక్యో, మనీలా, జకార్తా, మెల్‌బోర్న్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, బీజింగ్, సిడ్నీ, న్యూయార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్, చికాగో మరియు మెక్సికో సిటీలలో నివసించే వారు కూడా సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడగలరు. ఇక హైదరాబాద్ లో నేడు సాయంత్రం 5.40 నిముషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.

 గ్రహణ సమయంలో గర్భిణీలు జాగ్రత్త

గ్రహణ సమయంలో గర్భిణీలు జాగ్రత్త


ఖగోళంలో సంభవించే మార్పులు, గ్రహాల కదలికలు, గ్రహణాలు భూమిపై ఉన్న మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల పై నెగిటివ్ ప్రభావం చూపిస్తుందని చాలామంది భావిస్తారు. అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు. చంద్ర గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టిపరిస్థితులలోనూ ఆహారం తీసుకోకూడదు. ఇంట్లో పనులు చేయకూడదు . పదునైన వస్తువులను దూరంగా ఉండాలి.

గ్రహణ సమయంలో చెయ్యకూడని పనులు ఇవే

గ్రహణ సమయంలో చెయ్యకూడని పనులు ఇవే


గోరువెచ్చని నీటిని తాగాలి ఒకవేళ ఈ సమయంలో ఆహారం తీసుకోవాలి అనుకుంటే అందులో తులసి ఆకులను ముందుగానే వేసి ఉంచుకోవాలి. మరీ ఆకలిగా అనిపిస్తే పండ్లను ఆహారంగా తీసుకోవచ్చు. గ్రహణ సమయంలో మెటల్ వస్తువులకు దూరంగా ఉండాలి. ఏవైనా కట్ చెయ్యటం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు. గ్రహణ సమయంలో వ్యాయామం లాంటివి చేయకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు స్నానం చేయకూడదు .ఇంట్లోనే ఉండి మనసును తేలిక గా ఉంచుకోవడం, పడుకోవడం వంటివి చేసి గ్రహణం విడిచిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే గ్రహణ సమయంలో కలిగే అనర్థాల నుండి గర్భిణీ స్త్రీలు బయటపడతారని అనాదిగా విశ్వసిస్తూ వస్తున్నారు.

English summary
Today is lunar eclipse. A total lunar eclipse will occur in Hyderabad today at 5.40 pm. The lunar eclipse will begin at 5:32 pm and end at 6:18 pm. Today at 9:21 am Sutaka period will start. Pregnant women should be careful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X