• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీసీ ఫుటేజ్ కోరటం వెనుక- ప్రకాశ్ రాజ్ వ్యూహం ఇదేనా : భద్రంగా ఉంది- నిబంధనల ప్రకారం ఇస్తాం..!!

By Chaitanya
|

"మా" ఎన్నికల సమయంలో మొదలైన వివాదం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. పోలింగ్ నాడు జరిగిన ఘటనల పైన తమకు సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కి లేఖ రాశారు. ఎన్నికల్లో హోరా హోరీగా తలపడిన తరువాత జరిగిన పోలింగ్ లో విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆ వెంటనే నాగబాబు..తరువాత ప్రకాశ్ రాజ్ "మా" సభ్యత్వానికి రాజీనామా చేసారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో నెగ్గిన అభ్యర్ధులు తో కలుపుకొని మొత్తం 11 మంది సభ్యులు సైతం మా సభ్వత్వానికి రాజీనామా చేశారు.

సాక్షులుగా మాత్రమే మిగిలిపోయాం

సాక్షులుగా మాత్రమే మిగిలిపోయాం

మా ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని, బ్యాలెట్ పత్రాలు మారిపోయాయని ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు లీడింగ్ లో ఉండగానే.. ఫలితాలు తారుమారు చేశారని .. రకరకాలుగా ప్రకాశ్ రాజ్ బృందం ఎన్నికల తీరుపై ఆరోపణలు చేశారు. అయితే వారు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, మా ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని, ఎన్నికల అధికారి ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ‘ మా' ఎన్నికల్లో ఎన్నో దురదృష్ట కరమైన సంఘటనలకి తాము సాక్షులు గా మిగిలామని లేఖలో పేర్కొన్నారు.

ఆ ఇద్దరి బిహేవియర్ బాధించాయి

ఆ ఇద్దరి బిహేవియర్ బాధించాయి

డీఆర్సీ మెంబర్ మోహన్ బాబు, ‘మా' మాజీ ప్రెసిడెంట్ నరేశ్ సంఘ విద్రోహక చర్యలు, వారి రూడ్ బిహేవియర్ ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేసారు. వారి బెదిరింపులు, తిట్లు, దాడి తో మా ప్యానల్ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందారని పేర్కొన్నారు. పోలింగ్ రోజున మీరు సీసీటీవీలు ఉపయోగించారని చెప్పారు. అందులో అవి రికార్డ్ అయి ఉంటాయని వివరిస్తూ..ఆ ఫుటేజ్ ను ఇవ్వాలని కోరారు. దీని పైన స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ సీసీ ఫుటేజ్ భద్రంగా..నిబంధనల మేరకు ఇస్తామని స్పష్టం చేసారు.

ప్రకాశ్ రాజ్ లక్ష్యం ఏంటి

ప్రకాశ్ రాజ్ లక్ష్యం ఏంటి

అయితే, దీని వెనుక ప్రకాశ్ రాజ్ పెద్ద వ్యూహమే ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సీసీ ఫుటేజ్ ద్వారా నాలుగు రోజుల క్రితం ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు చెప్పిన దాడి విజువల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఎన్నికల్లో ఈ రకంగా జరుగుతున్నా..ఎన్నికల అధికారి సరైన రీతి లో స్పందించలేదంటూ..కో ఆపరేటివ్ సొసైటీ రిజిస్టార్ కి ఫిర్యాదు చేయటానికి అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. దీని ద్వారా ఎన్నికలు సరిగ్గా జరగలేదని చెప్పటానికి ఈ ఫుటేజ్ ను ఆధారంగా వినియోగించుకోవచ్చని టాలీవుడ్ లో చర్చ సాగుతోంది.

  Exclusive Interview with Bigg Boss 5 Contestant Hamida || Oneindia Telugu
  విష్ణు కాదు..ఆ ఇద్దరే అసలు లక్ష్యం

  విష్ణు కాదు..ఆ ఇద్దరే అసలు లక్ష్యం

  అయితే, తాము ఎన్నికల రద్దు కోరుకోవటం లేదని ఇప్పటికే ప్రకాశ్ రాజ్ స్పష్టం చేసారు. ఈ ఫుటేజ్ ద్వారా కేవలం మోహన్ బాబు.. నరేశ్ ఇద్దరి తీరును ఇండస్ట్రీలో చర్చకు పెట్టటమే లక్ష్యంగా ఉందనే వాదన మొదలైంది. అయితే, ఎన్నికల అధికారి నిబంధనల మేరకు అని చెప్పటంతో..ఆ నిబంధనలు ఏంటి..యధాతధంగా ఫుటేజ్ ఇస్తారా ..నిబంధనలు ఏం చెబుతున్నాయనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, ఇదే సమయంలో విష్ణు ఈ నెల 16న "మా" అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.

  English summary
  Days after MAA elections results, Prakash Raj had requested the Election officer to hand over the polling day video footages wherein the election officer had agreed to give the footages on condition.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X