ఒంటరి మహిళలే టార్గెట్, పోలీసు అవతారమెత్తిన పాత నేరస్తుడు, చివరికిలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:పోలీసు అవతారం ఎత్తి ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నగలు దోచుకొంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.సుబాష్ మిట్టల్ అనే పాత నేరస్థుడుగా పోలీసులు చెప్పారు.

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా మహిళలు, వృద్దులను టార్గెట్ చేసుకొని సుబాష్ మిట్టల్ అనే వ్యక్తి నగలను దోచుకొనేవాడు.సుబాష్ మిట్టల్ సూడో పోలీసు అవతారం ఎత్తాడు.

madhapur police arrested fake police in Hyderabad

పోలీసు అని చెప్పుకొంటూ బెదిరింపులకు దిగేవాడు. తనిఖీల పేరుతో వారి నుండి డబ్బులు, బంగారాన్ని దోచుకొని వెళ్ళేవాడు.అయితే నకిలీ పోలీసును బుదవారం నాడు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.

నిందితుడి నుండి రెండు బంగారు ఉంగరాలు, ఒక బంగారు గొలుసు 15 తులాల వెండి పట్టీలు, రూ.23 వేల నగదు, ఓ బైక్ ను , సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం సుబాష్ మిట్టల్ ను రిమాండ్ కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
madhapur police arrested fake police on wednesday.police seized gold rings, bike, 23 thousand rupees.
Please Wait while comments are loading...