డబ్బులు 'డబుల్' కావాలని కాదు: రూ.1.33 కోట్ల దోపిడీపై సందేశ్
హైదరాబాద్: డబ్బులు డబుల్ అవుతాయని తాము పూజలు చేయలేదని, దొంగ బాబా తమను నమ్మించి మోసం చేశాడని లైఫ్ స్టైల్ ఓనర్ మధుసూదన్ రెడ్డి తనయుడు సందేశ్ రెడ్డి శుక్రవారం నాడు చెప్పారు. మొదట తెలంగాణ పోలీసులకు ప్రత్యేక ధన్యావాదాలు అన్నారు.
తాము ఆ బాబాను గృహప్రవేశం పూజ కోసం పిలిపించామని చెప్పారు. మా ఇంట్లోనే బాబా డబ్బులు పూజ వద్ద పెట్టమని చెప్పాడని, అలా పెట్టడం తమ తప్పేమీ కాదన్నారు. కాకుంటే దొంగ బాబా అని తెలియక మోసపోయామని చెప్పారు.

ఇంట్లో దోషం ఉందని చెప్పి పూజలు చేశాడన్నారు. తమకు ప్రసాదంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయేలా చేశాడని చెప్పారు. అప్పుడో డబ్బులు దోచుకెళ్లాడని చెప్పారు. మా నాన్నకు ఓ స్నేహితుడి ద్వారా నకిలీ బాబా పరిచయం అయ్యాడని చెప్పారు. డబ్బులు డబుల్ అవుతాయని, తామేదో రాత్రికి రాత్రి అంబానీలం కావాలని ఈ పూజలు చేయలేదని చెప్పారు.
నిందితుడిని తాము శివానంద బాబా అని పిలిచేవాళ్లమని చెప్పారు. ఆయన తమను నమ్మించి మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. కాగా, బెంగళూరులో అరెస్టైన ఆ దొంగ బాబా పైన బంజారాహిల్స్ పోలీసులు 307, 420, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శివానందతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారని తెలుస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications