మెట్రోపై తగ్గారేం: తలసానికి మాగంటి ప్రశ్న, అహంకారం వద్దు: కెటిఆర్‌కు గుత్తా
హైదరాబాద్: అసెంబ్లీలో మెట్రో అలైన్‌మెంట్ నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలని టిడిపి హైదరాబాద్ అధ్యక్షులు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆదివారం ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాదులో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.
భారతీయ జనతా పార్టీతో కలిసి గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతో కలసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రస్తుతం టిడిపి ముందున్న లక్ష్యమన్నారు. ఆదివారం ఉదయం గ్రేటర్ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
భారీ సంఖ్యలో కార్యకర్తలు వెంటరాగా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నగర టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చిన విజయం తమ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ అన్నారు. ప్రస్తుతం తమ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యం గ్రేటర్‌లో పాగా వేయడమే అన్నారు.
అధికారం ఉందని అహంకారం వద్దు: గుత్తా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీ సీనియర్ నేత, సీఎల్పీ నేత జానారెడ్డి పైన ప్రశంసలు కురిపిస్తుంటే, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాత్రం అవమానిస్తున్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. అధికారముందని అహంకారంతో మాట్లాడితే జనాలు సహించరన్నారు.












Click it and Unblock the Notifications